కరీంనగర్‌లో విషాదం చోటుచేసుకుంది.టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న చంద్రశేఖర్ కుటుంబంలో ఈ దుర్ఘటన జరిగింది. ఆయన భార్య దివ్య మంగళవారం ఇంట్లోనే గన్నేరు గింజలు దంచి తినడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె పరిస్థితి విషమించడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.
అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.ఈ ఘటనకు గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.చంద్రశేఖర్,దివ్య దంపతులకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన ఆ పిల్లల పరిస్థితి చూసి స్థానికులు తీవ్రంగా కలచివేస్తున్నారు.
- Advertisement -
