Saturday, May 23, 2026
Homeవరంగల్‌Parvathagiri | ఉపాధి హామీ కూలీలకు సౌకర్యాలు కల్పించాలి.

Parvathagiri | ఉపాధి హామీ కూలీలకు సౌకర్యాలు కల్పించాలి.

  • NHRC తరుపున పర్వతగిరి ఎంపీడీవో కు మెమొరాండం.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని గ్రామాల్లో పనిచేయుచున్న ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశం వద్ద ఎండాకాలం లో ఎండ నుండి రక్షణ కొరకు షెడ్లు (చావని), చల్లని నీరు, తగిన ఉష్ణత నివారణ చర్యలు, విశ్రాంతి సమయాలు, అత్యవసర సమయాల్లో వెంటనే వైద్య సహాయం లాంటి సౌకర్యాలను కల్పించాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ పర్వతగిరి మండల ఇన్చార్జి గారె జయరాజ్ బుధవారం పర్వతగిరి ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్ కి మెమొరాండం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 సెక్షన్ 26 షెడ్యూల్-2 ప్రకారంగా పని ప్రదేశాల్లో ఉపాధి హామీ కూలీలకు తప్పనిసరిగా సౌకర్యాలు కల్పించాలని, ఇది చట్ట ప్రకారంగా కూలీల హక్కు అని అన్నారు. సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. కూలీల అటెండెన్స్ విషయంలో తలెత్తే సాంకేతిక సమస్యల విషయంలో కూలీలను ఇబ్బంది పెట్టవద్దని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News