Homeఆరోగ్యంWalking Vs Cardio | బరువు తగ్గడానికి మార్గాలు..

Walking Vs Cardio | బరువు తగ్గడానికి మార్గాలు..

  • నడక, కార్డియో వ్యాయామాలు మంచిది..
  • వివరించిన ఆరోగ్య నిపుణులు..

ఫిట్‌నెస్ ప్రపంచంలో చాలామంది లక్ష్యం బరువు తగ్గడమే. దీనికోసం ఎన్నో రకాల డైట్లు, వ్యాయామ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిలో అత్యంత ప్రాచుర్యం పొందినవి రెండు.. ఒకటి రోజూ 10,000 అడుగులు నడవడం, మరొకటి 30 నిమిషాల పాటు కార్డియో వ్యాయామం చేయడం. బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలనే విషయంలో తరచూ గందరగోళానికి గురవుతుంటారు. ఈ రెండు పద్ధతులు క్యాలరీలను బర్న్ చేసి, ఆరోగ్యాన్ని మెరుగుపరిచినప్పటికీ, వాటి పనితీరు, ఫలితాలు వేర్వేరుగా ఉంటాయి. మరి వీటిలో దేనివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో, ఏది ఎంచుకుంటే మంచిదో వివరంగా చూద్దాం.

రోజంతా చురుకుగా ఉండాలనే ఉద్దేశంతో 10,000 అడుగుల నడక అనే లక్ష్యం ప్రాచుర్యం పొందింది. ఇది తక్కువ శ్రమతో కూడిన వ్యాయామం. ఫిట్‌నెస్ ప్రయాణం కొత్తగా మొదలుపెట్టేవారికి, నెమ్మదిగా బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఒక అద్భుతమైన మార్గం. 10,000 అడుగులు నడవడం ద్వారా ఒక వ్యక్తి బరువును బట్టి సుమారు 350 నుంచి 500 క్యాలరీలు ఖర్చవుతాయి.

- Advertisement -

తీవ్రమైన వ్యాయామంలా కాకుండా, ఇది విపరీతమైన ఆకలిని లేదా అలసటను కలిగించదు. దీనివల్ల, వ్యాయామం తర్వాత ఎక్కువగా తినే ప్రమాదం తగ్గుతుంది. అంతేకాకుండా రోజంతా క్యాలరీలు ఖర్చు కావడానికి ఈ పద్ధతి సహాయపడుతుంది. తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు కలిగే అలసట కారణంగా మిగతా రోజంతా స్తబ్దుగా ఉండిపోయే ప్రమాదం నడకతో ఉండదు.

నిర్ణీత సమయంలో గుండె వేగాన్ని పెంచి, తక్కువ సమయంలో ఎక్కువ క్యాలరీలను బర్న్ చేయడానికి కార్డియో వ్యాయామాలు రూపొందించబడ్డాయి. సాధారణంగా 30 నిమిషాల కార్డియో సెషన్‌లో 150 నుంచి 250 క్యాలరీలు ఖర్చవుతాయి. క్యాలరీల ఖర్చు నడకతో పోలిస్తే తక్కువగా అనిపించినా, గుండె ఆరోగ్యానికి కార్డియో అత్యంత శ్రేష్ఠమైనది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News