- నోఫికేషన్ విడుదల చేసిన అధికారులు..
- గ్రాడ్యుయేట్స్, డిప్లమా వారికి అవకాశం..
హైదరాబాద్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో 147 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడులైంది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బీడీఎల్ గ్రాడ్యుయేట్, డిప్లొమా అభ్యర్థుల నుంచి అప్రెంటిస్షిప్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (బీఈ/బీటెక్) 122, డిప్లొమా అప్రెంటిస్ 25 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ ఇంజినీరింగ్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ, బీటెక్, డిప్లొమా (Diploma) ఉత్తీర్ణులై ఉండాలి.City & Local Guides
మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు రూ. 12,300, డిప్లొమా అప్రెంటిస్లకు రూ. 10,900 ఇస్తారు.
అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులకు పంపడానికి చివరితేదీ ఆగస్టు 6. దరఖాస్తు వెబ్సైట్, https://nats. education.gov.in/
regular_student.php లో చేసుకోవాలి.
