Monday, March 16, 2026
Homeహైదరాబాద్‌ABVP | విద్యారంగానికి నిధులు కేటాయించాలి

ABVP | విద్యారంగానికి నిధులు కేటాయించాలి

  • ఓ.యు ఏబీవీపీ డిమాండ్
  • 9 వేల కోట్ల స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి-లేదంటే ఉద్యమం తప్పదు విద్యార్థి నేతల హెచ్చరిక
  • తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్,కమిటీని రద్దు చేయాలి.

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం విద్య వ్యవస్థను పట్టించుకోకపోగా నిర్లక్ష్యానికి గురిచేస్తుండడంతో విద్యార్థి రంగామంతా భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారే అవకాశం పొంచి ఉన్నదని ఉస్మానియా యూనివర్సిటీ శాఖ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు గెలు శేఖర్,కార్యదర్శి మోక్షిత్ లు అన్నారు.

సోమవారం నాడు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద పత్రిక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా యూనివర్సిటీ అధ్యక్షుడు గెలు శేఖర్,కార్యదర్శి మోక్షిత్ మాట్లాడుతూ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోని విద్యారంగంలోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వారు డిమాండ్ చేశారు.

- Advertisement -

ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి కనీసం 15 శాతం నిధులు కేటాయించాలని వారు కోరారు.రాష్ట్రం ఏర్పడి సుమారు రెండున్నర సంవత్సరాలు గడిచినా విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోకుండా సుమారు ₹9000 కోట్ల స్కాలర్షిప్,ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల ప్రభుత్వ అసమర్థత సోమరితనం కారణంగా విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ఈ ప్రజా పాలన ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు,రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ప్రతిపాదించిన విద్యావిధానం విద్యావ్యవస్థను దెబ్బతీసే విధంగా ఉందని ఆరోపిస్తూ ఆ విద్యా కమీషన్‌ను తక్షణమే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఎమ్మెల్యేలు,మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రెటరీ పృథ్వితేజ,స్టేట్ జాయింట్ సెక్రెటరీ అలివేలు రాజు,విద్యానగర్ విభాగ్ కన్వీనర్ హరి ప్రసాద్,సిటీ జాయింట్ సెక్రెటరీ దినేష్,విజయ్ సింగ్,శివ,పూర్ణ,వంశీ తదితరులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News