Thursday, March 12, 2026
Homeఅంతర్జాతీయంIran | ముచ్చటగా మూడు షరతులు..

Iran | ముచ్చటగా మూడు షరతులు..

  • యుద్ధం ఆగిపోతుంది..
  • ఇరాన్ అధ్యక్షుడు వెల్లడి..

అమెరికా-ఇజ్రాయెల్ ద‌ళాల‌తో జ‌రుగుతున్న యుద్ధం ఆగాలంటే ఇరాన్ కొన్ని ష‌ర‌తులు విధించింది. ఇరాన్ అధ్య‌క్షుడు మ‌సోద్ పెజెష్కియాన్ దీని గురించి త‌న సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. అమెరికా కూట‌మితో ఎటువంటి ఒప్పందం జ‌రిగినా.. ఇరాన్ స‌హ‌జ హ‌క్కుల‌ను గుర్తించాల‌ని పెజెష్కియాన్ అన్నారు. ర‌ష్యా, పాకిస్థాన్ నేత‌ల‌తో ఈ అంశం గురించి చ‌ర్చించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

ప‌శ్చిమాసియా ప్రాంతంలో శాంతి స్థాప‌న జ‌ర‌గాలంటే కొన్ని అంశాలు కీల‌క‌మైన‌వని ఆయ‌న అన్నారు. అమెరికా-ఇజ్రాయెల్ ద‌ళాల‌తో యుద్ధం ముగియాలంటే మూడు అంశాలు ముఖ్య‌మైన‌వ‌ని పెజెష్కియాన్ తెలిపారు. ఇరాన్ హ‌క్కుల్ని గుర్తించ‌డం, న‌ష్ట‌ప‌రిహారాన్ని చెల్లించ‌డంతో పాటు భ‌విష్య‌త్తులో ఎటువంటి దాడులు చేయ‌బోమ‌న‌న్న గ్యారెంటీ ఇవ్వాల‌ని ఇరాన్ అధ్య‌క్షుడు అభిప్రాయ‌ప‌డ్డారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News