అధికార పక్షం ప్రజా పాలన అని ఊదరగొడుతుంటే… విపక్షం వైఫల్యాల పాలన అని ముద్ర వేస్తోంది. కానీ నినాదాల హోరులో సామాన్యుడి ఆకలి కేకలు, ఆశలు ఏమీ అర్థం కాక ఆవిరైపోతున్నాయి. పాలకులు మారినా, విపక్షాలు విమర్శలు చేస్తున్నా.. మధ్యలో తల పట్టుకుంటున్న జనం.. తమ ఓటు హక్కు ఒక అస్త్రమా లేక తమకే తగిలిన శాపమా అని ప్రశ్నించుకుంటున్నారు.. వాస్తవం ఏమిటంటే.. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే అవి కేవలం రాజకీయం కోసమే కాకుండా, ప్రజా శ్రేయస్సు కోసం జరిగినప్పుడు మాత్రమే వ్యవస్థ బాగుపడుతుంది.
- Advertisement -
