- తెలంగాణ ఫేమస్ సల్లచారు..
- ఇలా చేసుకోండి చాలా సింపుల్..
తెలంగాణలో సల్లచారు అంటే తెలియని వారు ఉండరు. మజ్జిగ పులుసు అని కూడా అంటారు. ముఖ్యంగా వేసవిలో ఈ వంటకాన్ని ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. మజ్జిగ పులుసును పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. అయితే ఈ సూపర్ టేస్టీ మజ్జిగ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు..? తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకోండి..
సూపర్ టేస్టీ ‘సల్లచారు’ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. పెరుగు తగినంత, ఉప్పు, అల్లం,పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు, పసుపు తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూస్తే.. ముందుగా ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర తరుగును కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని అందులో పెరుగు వేసుకోవాలి. పెరుగులో రుచికి తగినంత ఉప్పు తీసుకోవాలి.
ఇప్పుడు అల్లం ముక్కలను, పచ్చిమిర్చీ ముక్కలను, కరివేపాకును వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పెరుగును తీసుకుని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, పసుపు వేసి ఒకసారి మిశ్రమం మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి అల్లం పేస్టును వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు చేసుకుని మజ్జిగ చారును అందులో వేసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకుంటే చాలు. సూపర్ టేస్టీ సల్ల చారు రెడీ అయినట్టే..
