- చంద్రగ్రహణం సందర్భంగా ఆలయ సమయ వేళలలో మార్పులు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు.మంగళవారం 3వ తేదీ మధ్యాహ్నం 3:20 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:47 నిమిషాల వరకు గ్రహణకాలం సందర్భంగా ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు మరియు అనుబంధ దేవాలయాలలో కూడా 3వ తేదీ ఉదయం 7:00గంటల లోపు సుప్రభాతము నిజాభిషేకము, అర్చనలు ,బాలభోగము ,ముగించి దేవాలయాలు మూసి వేయబడనున్నాయి. మరుసటి రోజు అనగా 4వ తేదీ బుధవారం రోజున ఉదయం 3:00 గంటలకు ప్రధానాలయం,ఉప ఆలయాలు తెరిచి సంప్రోక్షణ, కార్యక్రమాలు,నిత్య కైంకర్యాలు నిర్వహింపబడతాయని ఈవో తెలిపారు

3వ తేదీ మంగళవారం
ఆలయ సమయ వేళల్లో మార్పులు
ఉదయం 3:00 గంటల నుండి 3:30 వరకు సుప్రభాతం
3:30 నిమిషాల నుండి 4:30 నిమిషాల వరకు తిరువారాధన, బాల భోగం,ఆరగింపు.

4:30 నుండి 5:15 నిమిషాల వరకు నిజాభిషేకము.
5:15 నిమిషాల నుండి 5:45 నిమిషాల వరకు సహస్రనామార్చన.
5:45 నిమిషాల నుండి 7:00 గంటల వరకు ఉభయదర్శనములు.
ఉదయం 7:00 గంటలకు ఆలయం మూసివేత.

మరుసటి రోజు 4వ తేదీ బుధవారం ఆలయ సమయ వేళలు
ఉదయం 3:00 గంటల నుండి 5:30 నిమిషాల వరకు గ్రహణ దోష, పరిహారార్థం, సంప్రోక్షణ, ఆలయశుద్ధి.
5:30 నిమిషాల నుండి 6:00 వరకు సుప్రభాతం.
6:00 గంటల నుండి 7:30 నిమిషాల వరకు తిరువారాధన, బాల భోగము,ఆరగింపు.
7:30 నుండి 8:15 వరకు నిజాభిషేకం.
7:30 కు సుదర్శన నారసింహ హోమము.
8:15 నిమిషాల నుండి 8:45 వరకు సహస్రనామార్చన.
8:45 నిమిషాల నుండి ఉభయ దర్శనములు ప్రారంభం.
ఉదయం 10:00 గంటలకు శ్రీ స్వామి వారి నిత్య కళ్యాణం.
