Sunday, March 1, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంOU | ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రశ్నాపత్రాల వివాదం..!

OU | ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రశ్నాపత్రాల వివాదం..!

ఒక సామాన్యుడికి ఎక్కడా న్యాయం జరగకపోతే చివరకు న్యాయస్థానాలను ఆశ్రయిస్తాడు.. న్యాయస్థానాలకు, బాధితులకు వారథిగా వుంటారు న్యాయవాదులు.. అలాంటి ఉన్నతమైన న్యాయవాదులను తయారుచేసే విశ్వవిద్యాలయాలు భ్రష్టుపట్టిపోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.. న్యాయవ్యవస్థలో అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని ఆకుళింపుచేసుకుని కోర్సును పూర్తిచేసి పరీక్షలకు సిద్ధం అవుతారు..

ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షా పత్రాల్లో గోల్ మాల్ జరిగితే ఆ న్యాయ విద్యార్థుల భవితవ్యం ఏమిటి..? న్యాయదేవత ముందు వాళ్ళు ఎలా తలెత్తుకుని న్యాయం తరఫున వాదించగలరు.. ఒక విస్తుబోయే సంఘటన ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయశాస్త్ర విభాగంలో చోటుచేసుకుంది.. న్యాయదేవత తలొంచుకునేలా జరిగిన ఈ ఘటనతో యావత్ విద్యావ్యవస్థ నివ్వెరబోయింది..

- Advertisement -

రెండు వేర్వేరు పరీక్షలకు వేర్వేరు తేదీలలో ఒకే ప్రశ్నాపత్రంతో పరీక్షలు జరిగాయి.. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన విద్యా వ్యవస్థ.. సీఎం దృష్టిపెట్టి నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది.. లేకపోతే విద్యావ్యవస్థతో బాటు, న్యాయ వ్యవస్థకూడా భ్రష్టుపట్టి పోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు న్యాయకోవిదులు, విద్యావేత్తలు..

హైదరాబాద్, ఫిబ్రవరి 29 (ఆదాబ్ హైదరాబాద్) : హైదరా బాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయ విభాగంలో నిర్వహించిన మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీసాయి. తేది 25-02-2026న జరిగిన ఎల్.ఎల్.బీ. (5 సంవత్సరాల లా డిగ్రీ ) పేపర్ 5 హిస్టరీ ఆఫ్ కోర్స్, లెజిస్లేచర్స్ అండ్ లీగల్ ప్రొఫెషన్ ఇన్ ఇండియా ప్రశ్నాపత్రం, తేది 27-02-2026న జరిగిన ఎల్.ఎల్.బీ. (3 సంవత్సరాల లా డిగ్రీ ) పేపర్ 6 – లీగల్ అండ్ కాన్సట్యూషనల్ హిస్టరీ ఆఫ్ ఇండియా ప్రశ్నాపత్రం రెండూ పూర్తిగా ఒకే విధంగా ఉండటం, అకాడెమిక్ వర్గాల్లో ఎన్నెన్నో అనుమానాలను లేవనెత్తుతుంది.

రెండు రోజుల వ్యవధిలో రెండు వేర్వేరు కోర్సులకు ఒకే ప్రశ్నాపత్రం ఇవ్వడం దేనికి సంకేతం..? సాధారణ పరిపాలనా విభాగం ఎం చేస్తోంది..? నిద్రబోతోందా..? లేక ఏదైనా మతలబు ఉందా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.. విశ్వవిద్యాలయ వర్గాలు మాత్రం అనధికారికంగా “సిలబస్ ఒకటే” కదా అని తప్పించు కునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలు స్తోంది. అయితే, సిలబస్ ఒకటే అయినప్పటికీ, కోర్సుల అకా డెమిక్ స్థాయి, ప్రవేశ అర్హతలు, మూల్యాంకన లోతు భిన్నంగా ఉంటాయి.

ఇందులో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు, 3 సంవత్సరాల ప్రొఫెషనల్ కోర్సు మధ్య ఉన్న ఈ నిర్మాణాత్మక తేడాలను పరిగణలోకి తీసుకోకుండా ఒకే ప్రశ్నాపత్రం రెండు వేర్వేరు తేదీల్లో ఇవ్వడం విధానపరమైన లోపంగా భావించ వచ్చు.. కొంతమంది విద్యార్థులు “మా కోర్సు స్థాయికి అను గుణంగా ప్రశ్నలు లేవు” అని వాపోతుండగా.. మరికొందరు “ఈ వ్యవహారం పరీక్షల నిర్వహణపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి అని అంటున్నారు.

ఈ అంశంపై కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లేదా రిజిస్ట్రార్ నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. విశ్వవిద్యాలయం జరిగిన వాస్తవాలను స్పష్టంగా వెల్లడించకపోవడం వెనుక మత లబు ఏమిటి అన్న అనుమానాలు సైతం వెల్లువెత్తుతు న్నాయి.. ప్రశ్నాపత్రాల రూపకల్పన, పేపర్ సెట్టర్ ఎంపిక, మోడరేషన్ బోర్డు ఆమోద ప్రక్రియ, ముద్రణ, భద్రతా విధానాలపై స్పష్టత ఇవ్వడం ఎంతో అవసరం. ఒకే ప్రశ్నాపత్రం రెండు వేర్వేరు తేదీలకు ఎలా చేరింది? మోడరేషన్ కమిటీ తన బాధ్యతను కరెక్ట్ గా నిర్వర్తించలేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి..

న్యాయ విద్యపై పర్యవేక్షణ బాధ్యత వహించే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన లీగల్ ఎడ్యుకేషన్ రూల్స్ ప్రకారం, కోర్సు నిర్మాణం, టీచింగ్ స్థాయి, మూల్యాంకన ప్రమాణాలు స్పష్టంగా వివిధ స్థాయిలకు అనుగుణంగా ఉండాలి. ఒకే ప్రశ్నాపత్రం వేర్వేరు అకాడెమిక్ స్ట్రీమ్స్‌కు రెండు వేర్వేరు తేదీల్లో ఇవ్వడం ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందా..? అన్నది ఇప్పుడు ముఖ్యం.. ఇదే తరహా సంఘటనలు గతంలో చోటు చేసుకున్నాయా..?

అనే దానిపై కూడా విశ్వవిద్యాలయం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ఇది ఒక యాదృచ్ఛిక సాంకేతిక లోపమైతే, దానిపై తక్షణ విచారణ జరిపి నివేదిక విడుదల చేయాలి. లేకపోతే, ఇది వ్యవస్థాత్మక వైఫల్యమైతే, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థి సంఘాలు స్వతంత్ర ఫ్యాక్ట్-ఫైండింగ్ కమిటీ ఏర్పాటు, అధికారిక వివరణ, అవసరమైతే పునఃపరీక్ష నిర్వహణ వంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.. న్యాయ విద్యా సంస్థల ప్రమాణాలు కేవలం తరగతి గదుల్లోనే కాకుండా పరీక్షా వ్యవస్థలోనూ ప్రతిబింబించాలి. విశ్వసనీయత కోల్పోతే, అది డిగ్రీ విలువను కూడా ప్రభావితం చేస్తుంది.

అయితే విద్యాశాఖ, న్యాయ శాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఈ సంఘటనపై ఖచ్చితంగా స్పందించాలి.. జరిగిన వ్యవహారాన్ని విచారణ చేయించాలి.. బాధ్యులు ఎవరైనా సరే కఠినంగా చర్యలు తీసుకోవాలి.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి బాధ్యతలు వహిస్తున్న శాఖలే లోపాల పుట్టగా మారిపోతే ఇక సాధారణ పరిపాలన పరిస్థితి ఏమిటి..?

అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.. అసలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనేవారు ఒకరు ఉన్నారని మర్చిపోతున్నారా..? దీనికంటూ ఒక వ్యవస్థ ఉంటుంది కదా..? మరి ఆ వ్యవస్థ పనిచేస్తోందా..? ఒక పద్ధతి లేకుండా పరీక్షల నిర్వహణ ఎలా చేపట్టారు..? మరి జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారు అన్నది వేచి చూడాలి.. న్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అయోమ యానికి గురి అయ్యి తమ భవితవ్యంపై ఆందోళన చెందకముందే తగిన పరిష్కారం ముఖ్యమంత్రే చూపాలని ప్రముఖ విద్యా వేత్తలు, మేధావులు కోరుతున్నారు..

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే..

ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వపు హక్కు అలాగే ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుంది.. మరి ఇంత తతంగం జరిగిన తరువాత ఉస్మానియా యూనివర్సిటీ బాధ్యత తీసుకుని నిర్వహించిన పరీక్షలను రద్దు చేస్తుందా..? ఒకవేళ అలా రద్దు చేస్తే ఎవరికీ నష్టం జరుగుతుంది అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది..

కీలకమైన ఈసమయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎలాం టి నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఇప్పుడు ఆసక్తిక రంగా మారింది.. ఏది ఏమైనా ప్రతిష్టాత్మకమైన న్యాయశాస్త్ర విద్యా వ్యవ స్థలో ఇలాంటి పొరబాట్లు జరగడం గర్హనీయం.. విద్యార్థులకు సరైన న్యాయం జరగాలని ఆదాబ్ హైదరాబాద్ ఆశిస్తోంది..

- Advertisement -
RELATED ARTICLES

Latest News