Sunday, March 1, 2026
Homeభక్తిEclipse | మర్చి 3న వచ్చే చంద్రగ్రహణం ప్రభావం..!

Eclipse | మర్చి 3న వచ్చే చంద్రగ్రహణం ప్రభావం..!

  • ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సిందే..
  • హెచ్చరిస్తున్న సిద్ధాంతులు..

తెలుగు పంచాంగం ప్రకారం మార్చి 3, మంగళవారం కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. దృక్ సిద్ధాంత పంచాంగం ప్రకారం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి, మార్చి 3 మంగళవారం రోజు సింహ రాశిలో పుబ్బ నక్షత్రంలో కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. విశ్వావసు నామ సంవత్సరంలో చివరిదైన ఈ గ్రహణం భారతదేశంలో కూడా కనిపించనుంది. మార్చి 3 వ తేదీ ఏర్పడనుంది పాక్షిక చంద్రగ్రహణం అయినప్పటికీ సాధారణంగా గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలని తప్పకుండా పాటించాలని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.

మన దేశంలో గ్రహణం ప్రారంభమయ్యే సమయానికి చంద్రోదయం కాదు. కానీ గ్రహణం విడుపు సమయానికి చంద్రోదయం అవుతుంది కాబట్టి ఈ గ్రహణాన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని అంటారు. మార్చి 3 న మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభం అవువుతుంది.

- Advertisement -

తిరిగి సాయంత్రం 6 గంటల 48 నిమిషాలకు చంద్రగ్రహణం ముగుస్తుంది. ఈ గ్రహణ కాలం మొత్తం 3 గంటల 27 నిమిషాలు. పేరుకు ఈ చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణమైనప్పటికీ మన దేశంలో చంద్రోదయం అయ్యాక ఈ గ్రహణం అనేక ప్రాంతాల్లో 25 నుంచి 40 నిమిషాల పాటు మాత్రమే కనిపించనుంది. అయితే గ్రహణం కనబడేది ఎక్కువగా ఈశాన్య భారతంలో మాత్రమే!

కొంతసేపు కనిపించినప్పటికీ గ్రహణ కాల నియమాలు మాత్రం తప్పకుండా పాటించాలని పండితులు చెబుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి ఆలయాన్ని ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఇతర ప్రధాన ఆలయాలు కూడా గ్రహణకాలంలో మూసివేయబడతాయి. గ్రహణ కాలంలో మూసి ఉన్న ఆలయాలు శుద్ధి తరువాత తిరిగి రాత్రికి తెరుచుకుంటాయి.

సనాతన ధర్మం పాటించే గృహస్థులు గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోరాదు. భోజన కార్యక్రమాలన్నీ మధ్యాహ్నం 12 గంటల వరకు ముగించుకోవడం మంచిది. ఇంట్లో నిల్వ ఉన్న ఊరగాయలు, పచ్చళ్ల మీద దర్భలు ఉంచాలి. గ్రహణానికి ముందు, గ్రహణం తరువాత పట్టు, విడుపు స్నానాలు ఆచరించాలి. గ్రహణం విడిచే సమయంలో సముద్ర స్నానం కానీ, నదీస్నానం కానీ చేయడం సర్వ శుభప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. రాత్రి 7:30 తరువాత విడుపు స్నానం చేసి, దైవారాధన చేసుకుని ఆహారాన్ని స్వీకరించవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News