Homeభక్తిBathukamma | బతుకమ్మ తల్లి పండుగ విశిష్టతను కాపాడండి..

Bathukamma | బతుకమ్మ తల్లి పండుగ విశిష్టతను కాపాడండి..

  • అర్థం లేని పేర్లతో పండుగ పవిత్రతను దిగజార్చకండి
  • ప్రభుత్వాలు, పురోహితులు, మీడియా వాస్తవికతను
  • గుర్తించి ప్రజలకు తెలియజేయండి
  • విశ్వ కళావిరాట్ డా. శాంతి కృష్ణ ఆచార్య

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల సంస్కృతులలో భారతీయ సంస్కృతి చాలా గొప్పదని, తొలుత నాగరికత నేర్చి ఆది నుండి వస్తున్న సనాతన సంస్కృతి నుండే నేడు అనేక సంస్కృతులు వెలబడ్డాయని, అందునా దక్షిణ భారతదేశంలోని తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని, పల్లె ప్రజల జీవన విధానం నుండి ఆవిర్భవించిన బతుకమ్మ(Bathukamma) తల్లి చరిత్రకు ఒక ప్రాముఖ్యత ఉందని, అలాంటి ప్రాముఖ్యతను దిగజార్చే విధంగా కొందరు ఆకతాయిలు చేసిన పనిని పరిగణలోకి తీసుకొని వాస్తవికతను గుర్తించక ఈనాడు ఇటు పురోహితులు అటు పత్రికలు అసత్య ప్రచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయని, వాటి మీద ఎలాంటి దృష్టి పెట్టని ప్రభుత్వాలు పట్టి పట్టనట్టుగా ఉంటున్నాయని ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత, విశ్వ కళావిరాట్ డా. శాంతి కృష్ణ ఆచార్య ఆవేదనను వ్యక్త పరిచారు.. బతుకమ్మ తల్లి జన్మస్థలమైన వరంగల్ జిల్లా, వర్ధన్నపేట నియోజకవర్గం, పర్వతగిరి మండలంలోని చౌటపల్లి గ్రామంలో గత నాలుగు దశాబ్దాలుగా అనేక కోణాల నుండి పరిశోధనలు నిర్వహించి బతుకమ్మ తల్లి వాస్తవికతను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నానని డా. ఆచార్య అన్నారు..

బతుకమ్మ తల్లి అనగా బతుకు నిచ్చే తల్లిగా… త్రిశక్తి దేవతలైన లక్ష్మీ మాత, గౌరీ మాత, సరస్వతి మాతల ఏక రూపంగానూ… బతుకమ్మ తల్లిని మనం పూల దేవతగానూ… పూజిస్తూ వస్తున్నాము. బతుకమ్మ తల్లి పండుగ ఆవిర్భవించిన తొలినాల్లలో “ఎంగిలి పడని పూలతో” పూజలు చేయడం కోసం తంగేడు పూలను ఎంచుకున్నారు. తంగేడు పూలను అప్పటివరకు ఏ పూజలో వాడలేదు, స్త్రీలు తలలో అలంకరించుకోలేదు, మాలలుగా అల్లి మెడలో వేసుకోలేదు, ఉత్సవాలు ఊరేగింపుల్లో ఎక్కడ కూడా తంగేడు పూలను వాడలేదు, అలాగే ప్రతి పువ్వు విరబూసిన తరువాత అందులోని మకరందాన్ని క్రిమి, కీటకాలు, పక్షులు స్వీకరిస్తాయి, అందుకని తంగేడు పూలను అరవిరిసిన దశలోనే (పూర్తిగా విచ్చుకోక మునిపే) మొగ్గ దశలో ఉన్నప్పుడే గుత్తులు, గుత్తులుగా కోసుకువచ్చి బతకమ్మ తల్లి పూజలో ఉపయోగిస్తామనీ కనుక అవి ఎక్కడ కూడా “ఎంగిలి పడని” పవిత్రమైన పువ్వులుగా నాడు వారు భావించి తొమ్మిది రోజులు ఆ పువ్వులతోనే బతుకమ్మ తల్లిని అలంకరించి అమ్మవారికి నవధాన్యాలైన తొమ్మిది రకాల ధాన్యాలను ఒక్కొక్క రోజు ఒక్కొక్క ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటూ… పూజ అనంతరం వాటిని వాయనములుగా స్త్రీలు ఒకరికొకరు పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ మానవ సమైక్యతను చాటుకునే అద్భుతమైన పండుగ బతుకమ్మ తల్లి పండుగ అని డా. ఆచార్య తెలియజేశారు

- Advertisement -

అలాంటి పండుగ విశిష్టత :

తొలి రోజును : “బతుకు నిచ్చే బతుకమ్మ తల్లి” గా పూజలు నిర్వహించి.. గోధుమలు, పెసల్లతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించారు.. రెండవ రోజు..: “ఆయుష్షు నిచ్చే బతుకమ్మ తల్లి” గా పూజలు నిర్వహించి.. వరి ధాన్యంతో చేసిన నైవేద్యాన్ని సమర్పించారు.. మూడవరోజు..: “ఆరోగ్య ప్రదాయిని బతకమ్మ తల్లి” గా పూజలు నిర్వహించి.. కందులతో చేసిన నైవేద్యాన్ని సమర్పించారు.. నాలుగవ రోజు..: “సిరి, సంపదలు నిచ్చే బతుకమ్మ తల్లి” గా పూజలు నిర్వహించి పెసల్లతో చేసిన నైవేద్యాన్ని సమర్పించారు.. ఐదవ రోజు : “సంతాన వృద్ధినిచ్చే బతుకమ్మ తల్లి” గా పూజలు నిర్వహించి.. శనిగలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించారు.. ఆరవ రోజు : ఆ రోజున “అరిష్టము” ఈ పదమును వాడుక భాషలో “అర్రెము” జరిగినది గా భావించి ఆరోజు పూజలను నిలిపివేస్తూ వస్తున్నారు.. వాస్తవానికి ఆరోజు నువ్వులతో చేసిన నైవేద్యంతో అమ్మవారి పూజలు నిర్వహించవలసి ఉంటుంది.. ఏడవ రోజు : “పాడి, పశువులను నొసగే బతుకమ్మ తల్లి” గా పూజలు నిర్వహించి బొబ్బర్లతో చేసిన నైవేద్యాన్ని సమర్పించారు.. నిమిదవ రోజు : “పసిడి పంటలను ఇచ్చే బతుకమ్మ తల్లి” గా పూజలు నిర్వహించి మినుములతో చేసిన నైవేద్యాన్ని సమర్పించారు.. తొమ్మిదవ రోజు : “సకల సౌభాగ్యములు”, “మాంగల్య బలమును” ఇచ్చే “బతుకమ్మ తల్లి” గా పూజలు నిర్వహించారు.. చివరి రోజైన 9వ రోజున నవధాన్యములలోని అన్ని ధాన్యాలతో చేసిన నైవేద్యాలను సమర్పించారని డా. ఆచార్య తెలియజేశారు..

మొదటి నుండి గడచిన ఎనిమిది రోజులు బతుకమ్మ తల్లి పూజలు నిర్వహించుకోలేక పోయినా స్త్రీలు కూడా చివరి రోజున తప్పకుండా పూజలు నిర్వహించడానికి ఇష్టపడతారన్నారు.. ఇలా అనాదిగా వస్తున్న సంప్రదాయాలను బ్రష్టు పట్టించడానికి కొంతమంది ఆకతాయిలు కల్పించిన పదాలను పరిగణలోకి తీసుకొని వాటికి ఆజ్యం పోసినట్టుగా…(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News