- పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి..
సీఎం కప్ రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని హన్సికరావు విజేతగా నిలిచింది. ఆత్మవిశ్వాసంతో లక్ష్యం వైపు గురి పెడితే విజయం తప్పదని నిరూపిస్తూ బంగారు పతకం సాధించింది. ఖమ్మం జిల్లా సర్ధార్ పటేల్ స్టేడియంలో ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో హన్సికరావు పెద్దపల్లి తరఫున పాల్గొని ప్రత్యర్థులను ఓడించి జిల్లా క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచింది. కాగా, ఆమె ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది.
- Advertisement -
