- మల్కాజిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నెల కాకముందే బోడుప్పల్ సర్కిల్లో జోరందుకున్న అక్రమ నిర్మాణాలు
- మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు ప్రజల సౌలభ్యం కోసమా లేక అధికారుల జేబులు నింపుకోవడానికి ఏర్పాటు చేశారా..?
- పల్లవి మోడల్ స్కూల్ లేన్ కాలనీ శివపురి కాలనీ ఫేస్ నెంబర్ 2 సమీపంలో రెండు అనుమతులకు ఒక్కటే నిర్మాణం
- టౌన్ ప్లానింగ్ తాత్కాలిక సిబ్బంది మధ్యవర్తిత్వంతో నిర్మాణదారుణి కుమ్మక్కు… అక్రమ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
మల్కాజిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్లో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ఒకడేమో కాలువలను కబ్జా చేసి బార్ కు సిట్టింగ్ షెడ్డు వేస్తాడు. మరొకడు రోడ్డుని కబ్జా చేసి ఇల్లు నిర్మిస్తాడు.ఇంకొకడు పార్కును కబ్జా చేసి టౌన్ ప్లానింగ్ అధికారులతో కుమ్మక్కై,దర్జాగా అనుమతులతో బిల్డింగ్ నిర్మిస్తాడు.డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారు ఇక్కడి టౌన్ ప్లానింగ్ అధికారులు.
మల్కాజిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నెలరోజులు తిరగకముందే బోడుప్పల్ సర్కిల్ లో జోరందుకున్న అక్రమ నిర్మాణాలు. పల్లవి మోడల్ స్కూల్ లేన్ శివపురి కాలనీ పేస్ 2 సమీపంలో రెండు పర్మిషన్లు కలిపి ఒకే బిల్డింగ్తో పాటు ఎలాంటి సెట్ బ్యాక్స్ లేకుండా ఒక అదనపు అంతస్తు తో అక్రమ నిర్మాణం చేపడుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో అక్రమ నిర్మాణాల వలన కార్పొరేషన్కు రావలసిన రెవెన్యూ పూర్తిగా అధికారులకు, రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళుతున్నాయి.
కొంతమంది అధికార పార్టీ రాజకీయ నాయకుల ప్రోద్బలంతో టౌన్ ప్లానింగ్ లోన్ తాత్కాలిక సిబ్బంది ఆడింది ఆటగా పాడింది పాటగా మారింది. రెండు పర్మిషన్లతో ఒక్కటే బిల్డింగ్ నిర్మిస్తున్న నిర్మాణదారుణితో లావాదేవీలు మాట్లాడిన, టౌన్ ప్లానింగ్ తాత్కాలిక ఉద్యోగి అధికారులను అటువైపు వెళ్లనీయకుండా గ్రీన్ సిగ్నల్ ఇప్పించాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సౌలభ్యం కోసం మూడు కార్పొరేషన్లను విభజించాడు.
కానీ మల్కాజిరి మున్సిపల్ కార్పొరేషన్ అందుకు విరుద్ధంగా మున్సిపల్ అధికారుల అధికారులకు జేబులు నింపడానికి మాత్రం సౌలభ్యంగా ఉందని సర్కిల్ ప్రజలు నవ్వుకుంటున్నారు. నాటి గ్రామపంచాయతీ నుండి అంచెలంచెలుగా ఎదిగిన బోడుప్పల్ సర్కిల్ మల్కాజిరి మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతిరహిత బోడుప్పల్ ఉండాలని, ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలను అరికట్టి, మున్సిపల్ ఆదాయంను పెంచుతారని సర్కిల్ ప్రజలు కోరుకుంటున్నారు.
బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఏ.శైలజ..
అక్రమ నిర్మాణాలపై ద్రుష్టి సారిస్తాం. అవినీతికి పాల్పడి అక్రమ నిర్మాణాలను సహకరించినట్లు తెలీతే టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.
