రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లోని 14 గ్రామాల నూతన సర్పంచులు సమవేశమై, అద్యక్షుడితో పాటు ఏకగ్రీవంగా నూతన కార్యవర్గ కమిటి ని ఎన్నుకున్నారు. ఈ సమావేశం లో అధ్యక్షులుగా గండిచెరువు గ్రామ సర్పంచ్ జక్క రవీందర్ రెడ్డినీ ఎన్నుకోగా, ప్రదాన కార్యదర్శిగా కందికంటి విజయ్ కుమార్(బండరావిరాల), ఉపాద్యక్షులుగా ఉప్పు మాధవి నవీన్ కుమార్(బలిజగూడ), కోట ప్రభాకర్ రెడ్డి (పిగ్లీపూర్), రాచపాక నవనీత -మహేశ్ (అనాజ్‌పూర్ ), కోశాధికారిగా ఎర్రవల్లి గౌరీశంకరాచారి (బాటసింగారం)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కార్యవర్గ సభ్యులుగా మందుగుల విజయ-శ్రీశైలం గౌడ్ (అబ్దుల్లాపూర్ మెట్), పబ్బతి బాలకిషన్ గౌడ్ (చిన్నరావిరాల), కోలన్ లక్ష్మీప్రసన్న – రవీందర్ రెడ్డి (కవాడిపల్లి ), దేశారం రాఘవేందర్ గౌడ్ (ఇనాంగూడ), అంతటి హేమలత-జంగయ్య గౌడ్ (గుంతపల్లి) , ఎర్ర వెంకటేష్ యాదవ్ (జాఫర్ గూడ ), మేడిపల్లి ప్రియ-చంద్ర శేఖర్ గౌడ్ (మజీద్ పూర్), అల్లి ఐలయ్య యాదవ్ (లష్కర్ గూడ) తదితరులు పాల్గొన్నారు.
