- ఏప్రిల్ 20, 2026 నుండి అమలు చేయడానికి ప్రణాళికలు..
ఇమ్మిగ్రేషన్ న్యూజిలాండ్ అధికారిక ప్రకటన ప్రకారం, ఏప్రిల్ 20, 2026 నుండి ఓపెన్ వర్క్ వీసా హోల్డర్ల ఉపాధి నిబంధనలలో మార్పులు అమల్లోకి రానున్నాయి. వివిధ రకాల ఓపెన్ వీసా కేటగిరీల కింద ఎటువంటి పనులకు అనుమతి ఉంటుందనే అంశంపై స్పష్టమైన మార్గదర్శకాలను అందించేందుకు ఈ అప్‌డేట్ ప్రకటించబడింది.
సాధారణంగా ఓపెన్ వర్క్ వీసా ఉన్నవారు న్యూజిలాండ్‌లోని ఏ ప్రాంతంలోనైనా, ఏ ఉద్యోగంలోనైనా, దాదాపు ఏ యజమాని వద్దనైనా పని చేయడానికి అనుమతి ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా… రెండు కొత్త ఉపాధి నిబంధనలు ఏప్రిల్ 20 నుండి, ఓపెన్ వర్క్ వీసాలు రెండు రకాల ఉపాధి నిబంధనలలో ఏదో ఒకటి కలిగి ఉంటాయి..
అన్ని రకాల పనులకు అనుమతి: కొన్ని వీసాలు కలిగిన వారు ఉద్యోగం చేయడంతో పాటు, స్వయం ఉపాధి పొందవచ్చు లేదా సొంతంగా వ్యాపారాన్ని కూడా నిర్వహించుకోవచ్చు. ఈ కేటగిరీలో భాగస్వామి ఆధారిత వర్క్ వీసాలు, పోస్ట్ స్టడీ వర్క్ వీసా, విద్యార్థులు, న్యూజిలాండ్ పౌరులు, సైనిక సిబ్బంది లేదా స్కాలర్‌షిప్ పొందిన వారితో ముడిపడి ఉన్న నిర్దిష్ట భాగస్వామి వీసాలు ఉంటాయి.
