Homeఎన్‌.ఆర్‌.ఐEdupayala | ఏడుపాయల జాతర ఆదాయం రూ. 87.5 లక్షలు

Edupayala | ఏడుపాయల జాతర ఆదాయం రూ. 87.5 లక్షలు

  • 29రోజుల హుండీ ద్వారా రూ. 39.87 లక్షలు
  • గతేడాది కంటే రూ.26 లక్షలు అధిక ఆదాయం

ఏడుపాయల జాతర ఆదాయం రూ. 87,56,268 వచ్చినట్లు ఏడుపాయల దేవస్థానం ఈఓ వీరేశం వెల్లడించారు. బుధవారం ఏడుపాయల్లోని గోకుల్ షెడ్ లో హుండీ లెక్కింపు జరిగింది. 29 రోజుల హుండీ ఆదాయం రూ. 39,87,178, ఒడిబియ్యం ద్వారా రూ. 69,200, కేశఖండనం ద్వారా రూ.56,600, ఒక వంద రూపాయల ప్రత్యేక దర్శనం ద్వారా రూ.10,09,600 అదేవిధంగా 20 రూపాయల ప్రత్యేక దర్శనం ద్వారా రూ.3,59,420, లడ్డు ప్రసాదం ద్వారా రూ. 22,48,640, పులిహోర ప్రసాదం ద్వారా రూ.10,25,630 మొత్తం కలిసి 87 లక్షల 56 వేల 268 రూపాయలు వచ్చిందని వెల్లడించారు.

Edupayala Fair Hundi Counting

ఐతే గతేడాది 16 రోజుల జాతర ఆదాయం రూ.24,56,277 రాగా ఈ ఏడాది 29 రోజుల ఆదాయం రూ. 87,56,268 సమాకూరింది. దీనితో పాటు 32 గ్రాముల మిశ్రమ బంగారం, 730 గ్రాముల వెండి అదనపు ఆదాయం. సరాసరిగా చూస్తే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం 26 లక్షల ఆదాయం (దాదాపు రూ. 42 శాతం) పెరిగిందని చెప్పవచ్చు. ఏడుపాయల జాతర ప్రత్యేక అధికారి, సహాయక కమిషనర్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో జరిగిన ఈ హుండీ లెక్కింపులో ఈఓ వీరేశంతోపాటు దేవస్థానం సిబ్బంది, శ్రీ వెంకట అన్నమాచార్య సేవా సమితి బృందం తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు బందోబస్తు నిర్వహించారు.

Edupayala Fair Hundi Counting1
- Advertisement -
RELATED ARTICLES

Latest News