Tuesday, February 24, 2026
Homeనిజామాబాద్‌Protest | జీవో 25ను సవరించాలి.

Protest | జీవో 25ను సవరించాలి.

  • నిరసన వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు..
  • వివరాలు తెలియజేశిన సోమిశెట్టి రాములు..

మండలంలోని శెట్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్జీటీ యూనియన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు జీవో 25ను సవరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి రాములు మాట్లాడుతూ.. జీవో 25 సవరణ అనంతరమే రేషనలైజేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. 5 డీఏలు ప్రకటించి 51శాతం ఫిట్మెంట్లో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరారు.

ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ మండల ప్రధాన కార్యదర్శి సర్దార్ రాథోడ్, జిల్లా కార్యదర్శి దామోదర్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News