- రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ ర్రావు అరెస్టు పిరికి చర్య – ఆదర్ష్ ముదిరాజ్
- నిరసన వ్యక్తం చేసిన మెట్టుగూడ బీజెపి శ్రేణులు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ,ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్య గళాన్ని అణగదొక్కే విధంగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడం ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయాలకు నిదర్శనమని వారు ఆరోపించారు.
అమానుషంగా బిజెపి రాష్ట్ర సారథి అధ్యక్షుడు అండ్ రామచందర్రావుని అరెస్టు చేయడం పిరికి చర్య అని మెట్టుగూడ డివిజన్ బీజేపీ అద్యక్షుడు ఆదర్శ్ ముదిరాజ్ అన్నారు.ఈ సందర్భంగా మెట్టుగూడ స్కైలాబ్ జంక్షన్ వద్ద ఆదర్శ ముదిరాజ్ ఆధ్వర్యంలో బిజెపి శ్రేణులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికిపై నిరసన నిర్వహించారు.ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్‌చందర్ రావు గారిని అరెస్ట్ చేయడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష స్వరాన్ని అణచివేయడం సరికాదని,ఇలాంటి చర్యలు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతాయని తెలిపారు.ప్రజల సమస్యలపై పోరాటం చేస్తే అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడం వంటిదని మండిపడ్డారు.ప్రభుత్వం వెంటనే రాజకీయ కక్షసాధింపును విరమించి, అరెస్టు చేసిన నాయకులు మరియు కార్యకర్తలను విడుదల చేయాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
ప్రజల హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమానికి దిశ కమిటీ సభ్యురాలు శారద మల్లేష్,బీజేపీ రాజేష్,సత్తూరి రవీందర్,భూషణ్ శ్రీనివాస్,అంజయ్య,అల్లాడి గంగాధర్,సరోజ,శశికళ,ఉదయ్ కుమార్,వరుణ్ యాదవ్,సుధాకర్,పవన్,గుంటి సీను,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
