Thursday, February 19, 2026
Homeవరంగల్‌Encounter | 'కర్రె"గుట్టల్లో భారీ ఎన్ కౌంటర్

Encounter | ‘కర్రె”గుట్టల్లో భారీ ఎన్ కౌంటర్

  • ఐదుగురు మావోయిస్టులు మృతి

ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దులోని “కర్రె”గుట్టల్లో రాష్ట్ర, కేంద్ర మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్ లు రెండ్రోజులుగా ఈ ప్రాంతంలో టార్గెట్ లకై సంచరిస్తున్నారన్న వేగుల వార్తల నేపథ్యంలో గురువారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణ సరిహద్దులో ఆపరేషన్ “కగార్” రెండో దశ మొదలుపెట్టిన భద్రతా బలగాలు.. మహబూబాబాద్, ములుగు జిల్లాల పరిధి లోని అడవుల్లో నిన్నటి నుంచి కూంబింగ్ చేపట్టాయి.

ఈ క్రమంలో ఈ ఉదయం భారీ ఎన్ కౌంటర్ చోటుచే సుకుంది. భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ భీకర ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు ఐదుగురు మావోయిస్టులు మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. వీరిలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. ఎదురుకాల్పులు జరుగుతున్నా యని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఘటనా స్థలం నుంచి భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నాయి.పూర్తి స్థాయిలో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News