- ఈ లైట్లు ఎంటీ..?? ఈ వాహనాలు ఎంటీ??
ఓ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమా! రోడ్ల మీద రాత్రి 7గంటలతరువాత వాహనాలు నడపాలంటే భయమేస్తోంది. ఎదురొచ్చే వాహనాల లెడ్ లైట్స్ వల్ల కళ్లు ఏమి కనిపించకుండపోతున్నాయి. వాహనాలకు కొత్తగా లెడ్ లైట్స్ వస్తున్నాయి. ఆర్.టీ.ఓ అధికారుల నియంత్రణ లేదు. గతంలో వాహనాల హెడ్ లైట్ కు సగం వరకు బ్లాక్ పెయింట్ కానీ, బ్లాక్ స్టిక్కర్ కానీ, వేస్తే కానీ వాహనాలకు అనుమతి నిచ్చేవారుకాదు, యిప్పుడు ఆ రూల్ తీసేసారో ఏందో తెలీదు.
ఎదురుగా వచ్చే వాహనాల లైట్ల కాంతి వల్ల కళ్లకు ఏమీ కనపడకుండా పోయి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి, కనుక సంబంధిత అధికారులు వాహనాల హెడ్ లైట్స్ ల కు వస్తున్న లెడ్ లైట్స్ గురించి చర్య తీసుకొని, కనీసం హెడ్ లైట్ల కు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ కానీ, బ్లాక్ పెయింట్ కానీ వేయాలనే రూల్ ను పునరుద్దరించాలని ప్రజలు, వాహన దారులు కోరుతున్నారు.
