Wednesday, February 18, 2026
Homeరంగారెడ్డిCelebrations | ఘనంగా మాజీ కౌన్సిలర్ మణికంఠ గౌడ్ జన్మదిన వేడుకలు

Celebrations | ఘనంగా మాజీ కౌన్సిలర్ మణికంఠ గౌడ్ జన్మదిన వేడుకలు

  • మణికంఠ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన
  • మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి,జంగయ్య యాదవ్,

మేడ్చల్ సర్కిల్ మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నేత రామన్న గారి మణికంఠ గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం సైతం మణికంఠ గౌడ్ జన్మదిన వేడుకలను అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రముఖులు హాజరై మనికంట గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.అనంతరం పట్టణ వాసులందరికీ ఏర్పాటు చేసిన విందు భోజనానికి విశేష స్పందన లభించింది.

ఘనంగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు

మంగళవారం మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సైతం జన్మదిన వేడుకలను అభిమానులు, కార్యకర్తలు మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మణికంఠ గౌడ్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలిసి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బర్త్ డే సందర్భంగా రామన్న గారి మణికంఠ గౌడ్ 70 కిలోల కేకును అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News