- చైర్మన్, వైస్ చైర్మన్ లను సన్మానించిన
- ఎమ్మెల్యే మల్లారెడ్డి
ఎల్లంపేట మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠభరితంగా ముగిసింది. మొత్తం 24 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో చైర్మన్ పదవికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 13 కాగా, బీఆర్ఎస్ పార్టీ 12 సీట్లతో ఒక ఓటు తక్కువలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు, బీజేపీ 4 సీట్లు సాధించాయి. చైర్మన్ ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఉన్న ఎక్స్-అఫీషియో ఓటు కీలకంగా మారింది.
ఈసారి ఆయన తన ఓటు హక్కును వినియోగించారు. బీజేపీ సభ్యులు బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడంతో బీఆర్ఎస్కు అవసరమైన మెజార్టీ లభించింది. దీంతో ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ తరఫున 8వ వార్డు సభ్యురాలు లావుడియా శ్రీదేవి చైర్మన్ గా ఎన్నికయ్యారు.వైస్ చైర్మన్ గా బీజేపీకి చెందిన 12వ వార్డు సభ్యురాలు మేకల రజిత దేవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.

వైస్ చైర్మన్ పదవికి మేకల రజితపేరును నరసింహ ప్రతిపాదించగా, బిందెల కుమార్ మద్దతు తెలిపారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీసభ్యులు వాకౌట్ చేశారు. చైర్మన్ పదవికి బీఆర్ఎస్,అభ్యర్థి లావుడియా శ్రీదేవి పేరును చిన్నోల భాస్కర్ ప్రతిపాదించగా, సద్ది నిశిత మద్దతు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ తరఫున శాంతిని ముత్యాలు గౌడ్ పేరును వేణు ప్రతిపాదించి మద్దతు ఇచ్చారు.ఓటింగ్లో శ్రీదేవికి 17 మంది మద్దతు లభించగా,శాంతికి 8 మంది మద్దతు లభించింది.
ఇక ఎంపీ.ఈటల రాజేందర్ ఎక్స్-అఫీషియో ఓటుకు అప్లైచేసినప్పటికీ సమావేశానికి,హాజరుకాలేకపోవడంతో ఆయన ఓటు నమోదు కాలేదు.మొత్తం ఎక్స్-అఫీషియో ఓట్లు కలుపుకొని 26,మంది సభ్యులు ఉండగా, సమావేశానికి 25మందిహాజరయ్యారు. ఎన్నికల అనంతరం బీఆర్ఎస్శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.
