Monday, February 16, 2026
HomeతెలంగాణKTR | హంగ్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అరాచకాలు

KTR | హంగ్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అరాచకాలు

  • కౌన్సిలర్లను కిడ్నాప్ చేస్తూ, ప్రలోభాలకు గురిచేస్తోంది
  • సింగరేణిలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి పని చేస్తున్నాయి
  • సింగరేణి అవినీతిపై పోరాటం చేస్తాం
  • కేసీఆర్ను మళ్లీ సీఎం చేసేందుకు మద్దతు ఇవ్వండి
  • బంజారాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు..

గిరిజనులకు రిజర్వేషన్లు పెంచిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే సేవాలాల్ బంజారా భవన న్ను బంజారాహిల్స్లో నిర్మించారని గుర్తు చేశారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా బంజారాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఒకే రోజు నాలుగున్నర లక్షల ఎకరాలకు సంబంధించి గిరిజనులకు పోడు పట్టాలు అందించిన ఘనత కేసీఆర్జే అని తెలిపారు.

మా తండాలో మా రాజ్యం ఉండాలన్న లాంబాడాల ఆత్మగౌరవాన్ని నిజం చేసింది బీఆర్ఎస్ అధినేత అని గుర్తు చేశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిందీ కేసీఆర్ అని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. ఇక కాంగ్రెస్, సీపీఐ పార్టీలు అలయన్స్లో ఉన్నాయని.. సింగరేణి దోపిడీని అరికట్టడానికి తాను సీపీఐకి మద్దతు ఇస్తానన్నారు. సింగరేణిలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి పని చేస్తున్నాయని విమర్శించారు. సీపీఐపైన ఏ ఒత్తిళ్లు వచ్చి కొత్తగూడెంలో కాంగ్రెస్ పొత్తుకు ఒప్పుకుందో తనకు తెలియదని పేర్కొన్నారు.

- Advertisement -

ఎవరు కలిసొచ్చినా, రాకున్నా తాము సింగరేణి అవినీతిపై పోరాటం చేస్తామని కుండబద్దలు కొట్టారు. హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేస్తోందంటూ మండిపడ్డారు. తమ కౌన్సిలర్లను బెదిరిస్తున్నారని.. మరికొన్ని చోట్ల కిడ్నాప్ సైతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉన్న అంచనా మేరకు హంగ్ మున్సిపాలిటీల్లో 10 వరకు బీఆర్ఎస్కు రావచ్చని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News