మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పాలైన స్వతంత్ర అభ్యర్థి భర్త ఓటర్లకు ఇచ్చిన డబ్బును తిరిగివ్వాలని డిమాండ్ చేయడంతో వారు తిరగబడ్డారు. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని బండమాచారం 19వ వార్డులో పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి ఓటమి పాలైంది. దీంతో తమకు ఓటేయలేదంటూ ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని ఆమె భర్త ఓటర్ల ఇంటి వద్దకు వెళ్లి అడిగారు.
తమకు నిజంగా ఓటేశారా..? గుడి లోకి వచ్చి నిరూపించుకోవాలనడంతో ఓటర్లు ఆయనపై మండిపడ్డారు. డబ్బులు ఎవరు ఇవ్వమన్నారు..?అంటూ తిరగబడ్డారు. మేము మీకు ఓటు వేయలేదని ఎలా నిరూపిస్తారంటూ వాగ్వాదానికి దిగారు. సదరు అభ్యర్థి భర్త గతంలో ఆ గ్రామానికి సర్పంచిగా పనిచేశారు. డబ్బులు అడుగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
- Advertisement -
