- పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి ల డిమాండ్
చతిస్గడ్ రాష్ట్రo జేగర్గుండా పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించిన తెలంగాణ ప్రాంత ప్రజలను పాత్రికేయులను వెంటనే విడుదల చేయాలని “పౌర హక్కుల సంఘం తెలంగాణ’రాష్ట్ర కమిటీ” అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి లు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, కె.నారాయణ రావు లు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ని మారేడుమిల్లి అడవుల్లో పోలీసుల ఎన్కౌంటర్ లో “మావోయిస్టు సెంట్రల్ కమిటీ” నాయకుడు “మడిమి హిడ్మ” చనిపోయి 40 రోజులు కావస్తున్న సందర్భంలో ఆదివాసి గిరిజన సంప్రదాయ ప్రకారం ఆయన నిర్యాణ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో ఆదివాసి ప్రాంతానికి కొంతమంది తెలంగాణ ప్రజలు, మరికొందరు తెలంగాణ ప్రాంత పాత్రికేయులు అక్కడికి వెళ్లి కార్యక్రమంలో పాల్గొని తిరిగి చతిస్గడ్ నుండి వస్తున్న క్రమంలో చతిస్గడ్ రాష్ట్ర పోలీసులు పాత్రికేయులను,ప్రజలను అక్రమంగా అరెస్ట్ చేసి జెగు్రుగొండ పోలిస్టేషన్ లో నిర్బంధించారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఒక ఆదివాసీ ప్రజల నాయకుడు చనిపోయిన హిడమా, రాజే ల 40 రోజుల కార్యక్రమంలో ప్రజలు, పాత్రికేయులు పాల్గొనడం ఎందుకు నేరం అవుతుందని వారు ప్రశ్నించారు.చనిపోయిన వారికి అంతిమ కార్యక్రమాలు నిర్వహించడం మన సంప్రదాయం అని, జెగు్రుగొండ పోలీసుస్టేషన్ లో నిర్భంధించిన వారిని వెంటనే విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుందని, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులుప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఎన్ నారాయణ రావులు ఆ ప్రకటన లో తెలిపారు.
