Friday, February 13, 2026
Homeవరంగల్‌Narsampet | నర్సంపేట మున్సిపాలిటీపై ఎగరనున్న కాంగ్రెస్ జెండా

Narsampet | నర్సంపేట మున్సిపాలిటీపై ఎగరనున్న కాంగ్రెస్ జెండా

  • 30 వార్డుల్లో 21 వార్డుల గెలుపు 6 తో సరిపెట్టుకున్న బిఆర్ఎస్, ఖాత తెరిచిన సిపిఎం, బిజెపి, స్వతంత్ర అభ్యర్థి

నర్సంపేట మున్సిపాలిటీ 30 వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. సందర్భంగా ఈనెల 11వ తేదీన హోరా హోరీగా జరిగిన ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలతో పాటు వామపక్ష పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 120 మంది పోటీలో ఉండగా ఎన్నికలు సజావుగా జరిగాయి. అనంతరం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో 60 బూతుల్లో సేకరించిన బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూములో అధికారులు భద్రపరిచారు.

శుక్రవారం ఉదయం 7 గంటల ప్రారంభమైన ఎన్నికల లెక్కింపు ప్రక్రియ 10 టేబుల్ ల పై ఆరు రౌండ్లలో ఫలితాలను అధికారులు బహిర్గతం చేశారు. అత్యంత ఉత్కంఠలో నడుమ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒక్క స్థానాలను కైవసం చేసుకోగా ఆరు స్థానాలకే బిఆర్ఎస్ పార్టీ తోక ముడిచింది. బిజెపి పార్టీ 28వ వార్డులో తమ సత్తాను చాటి గెలుపొందింది. అదేవిధంగా పదవ వార్డులో కేంద్ర రాష్ట్ర పార్టీల మెడలు వoచి సిపిఎం అభ్యర్థి అనుమకొండ శ్రీధర్ గెలుపొందారు.

- Advertisement -

అదేవిధంగా 8వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి దొంగల రజిత తమ సత్తాను చాటి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముందస్తు ప్రకటించిన విధంగా 25వ వార్డులో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన పెండెం శ్రీలక్ష్మి రామానంద్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా పిఠాన్ని అధిరోహించేలా చర్యలు తీసుకుంటున్నారు.

01.వార్డు.. కొత్తకొండ మేఘన (కాంగ్రెస్)
02 వార్డు.. కొంపల్లి వీణ (కాంగ్రెస్)
03 వార్డు.. ముత్తినేని వెంకన్న (కాంగ్రెస్)
04 వార్డు.. బీరం భరత్ రెడ్డి (కాంగ్రెస్)
05 వార్డు.. పొన్నాల మనిషా (కాంగ్రెస్)
06 వార్డు.. పొన్నాల నరసింహారెడ్డి (కాంగ్రెస్)
07వార్డు… గంధం నరేందర్ (కాంగ్రెస్)
08వార్డు.. దొంగల రజిత (ఇండిపెండెంట్)
09 వార్డు.. రాయిడి కీర్తి రెడ్డి (బీఆర్ఎస్)
10 వార్డు.. హనుమకొండ శ్రీధర్ (సిపిఎం)
11 వార్డు.. చీకటి స్వరూప (కాంగ్రెస్)
12 వార్డు.. ఇస్లావత్ రామ గోపి (కాంగ్రెస్)
13 వార్డు.. భూక్య మత్రు రాథోడ్ (కాంగ్రెస్)
14 వార్డు.. బూస శిరీష (బి ఆర్ ఎస్)
15 వార్డు.. ఏపూరి శ్రీనివాస్ రెడ్డి (కాంగ్రెస్)
16 వార్డు… బానోతు నవీన్ నాయక్ (బి ఆర్ ఎస్)
17 వార్డు.. అయూబ్ ఖాన్ (కాంగ్రెస్)
18 వార్డు.. దొమ్మాటి రమ్య (బీఆర్ఎస్)
19 వార్డు.. ఎలకంటి విజయ్ కుమార్ (కాంగ్రెస్)
20 వార్డు.. శ్రీ రామోజీ రోజా రాణి (కాంగ్రెస్)
21 వార్డు.. శివరాత్రి స్వామి(బి ఆర్ ఎస్)
22 వార్డు.. బాణాల ప్రసన్న (కాంగ్రెస్)
23 వార్డు.. వేల్పుల శ్రీలత (కాంగ్రెస్)
24 వార్డు.. బత్తిని రాజేందర్ (కాంగ్రెస్)
25 వార్డు.. పెండం శ్రీలక్ష్మి (కాంగ్రెస్)
26 వార్డు.. మండల శ్రీదేవి (బిఆర్ఎస్)
27 వార్డు..ములకల వినోద (కాంగ్రెస్)

28 వార్డు.. జూలూరి రోజా రాణి (బిజెపి)
29.వార్డు.. వేముల సంధ్య గౌడ్ (కాంగ్రెస్)
30 వార్డు.. మాదసి రవి(కాంగ్రెస్) గెలపొందిన వారిలో ఉన్నారు.

    - Advertisement -
    RELATED ARTICLES

    Latest News