- ఉత్కంఠభరితంగా సాగిన ఫలితాలు
చేవెళ్ల మున్సిపాలిటీలో తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. చేవెళ్ల ఫరా ఇంజనీరింగ్ కలేజీలో ఏర్పాటు చేసిన ఎన్నికల ఫిలితాల విడుదల ఉత్కంఠంతో హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఓటర్లు హస్తం పార్టీ వైపు మొగ్గు చూపారు. గెలుపొందిన నాయాకులు, కార్యకర్తులు వార్డుల సభ్యులు ప్రధాన రోడ్లపై టపాకులు పేల్చి సంబురాలు చేసుకున్నారు.
వార్డుల వారిగీ చూసుకుంటే
1వ వార్డు దూత మల్లేష్ బీఆర్ఎస్ 236, 2వ వార్డు డప్పు సువర్ణ చందు బీఆర్ఎస్ 198, 3వ వార్డు కరికే మీనాక్షి బీజేపీ 217, 4వ వార్డు మాధవి యాదిరెడ్డి కాంగ్రెస్ 388, 5వ వార్డు శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్ 126, 6వ వార్డు సుచిత్ర బల్వంత్‌రెడ్డి కాంగ్రెస్ 13, 7వ వార్డు కురువ మంగమ్మ బీఆర్ఎస్ 147, 8వ వార్డు డి. గోపాల్‌రెడ్డి కాంగ్రెస్ 317, 9వ వార్డు తాళ్లపల్లి నర్సింలు కాంగ్రెస్ 106, 10వ వార్డు పెద్దోళ్ల దయాకర్ బీజేపీ, 11వ వార్డు మధుసుధన్‌రెడ్డి కాంగ్రెస్ 390, 12వ వార్డు మీనాక్షి అనంతరెడ్డి బీజేపీ 13, 13వ వార్డు కాసుల రాముగౌడ్ కాంగ్రెస్ 411, 14వ వార్డు మద్దెల శ్రీను కాంగ్రెస్ 78,
15వ వార్డు బండారి శైలజా ఆగిరెడ్డి 333, 16వ వార్డు దేవర సమతా వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ 707, 17వ వార్డు ఎం. కృష్ణానాయక్ కాంగ్రెస్ 374, 18వ వార్డు మంగళి కళ్యాని యాదగిరి 93, వంటి మెజారిటీతో వారు గెలుపొందారు. కాంగ్రెస్: 11 బీఆర్ఎస్ 4, బీజేపీ 3 వార్డులు గెలుపొందారు. మెజారిటీ వార్డులను కైవసం చేసుకోవడంతో చేవెళ్ల మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ ఖాతాలో చేరింది. పార్టీలోని అంతర్గత ఒప్పందం ప్రకారం, 16వ వార్డు నుంచి గెలుపొందిన దేవర సమత వెంకట్‌రెడ్డికి మున్సిపల్ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది. గతంలో దేవర వెంకట్‌రెడ్డి పీఏసీఎస్ చైర్మన్‌గా సేవలు అందించడం, స్థానికంగా ఉన్న బలమైన మద్దతు వారికి కలిసొచ్చేంది.
