- PDSU డిమాండ్
ప్రగతీశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గం ఓయూ విద్యార్థి నాయకులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మంద నవీన్,ప్రధాన కార్యదర్శి కే శ్రీనివాసులు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం ఉస్మానియా యూనివర్సిటీ సెంటినరీ హాస్టల్‌లో ఓ విద్యార్థిని తల్లిని లోపలికి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ ఆర్ట్స్ కళాశాల ముందు జరిగిన ధర్నాకు మద్దతు తెలిపిన పది మంది విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేసి 126(2), 223, 292 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై కేసులు మోపడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు.హాస్టల్ డైరెక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సిందిపోయి విద్యార్థులపై కేసులు పెట్టడం తగదని అన్నారు.వెంటనే కేసులు ఎత్తివేయకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
