Friday, February 13, 2026
Homeమహబూబ్‌నగర్‌Wanaparthy MLA | మార్నింగ్ వాక్ తో పలు సమస్యలు గుర్తింపు.

Wanaparthy MLA | మార్నింగ్ వాక్ తో పలు సమస్యలు గుర్తింపు.

  • ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి..

వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి గురువారం వనపర్తి పట్టణంలోని నంది హిల్స్ 30 వ వార్డులో మార్నింగ్ వాక్ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలనీ వాసులతో కలిసి నడక సాగించారు. నంది హిల్స్ పార్కు లో నిర్మిస్తున్న సామూహిక భవన నిర్మాణ పనులను పరిశీలించారు.

టిఎంఆర్ స్విమ్మింగ్ పూల్ ప్రాంతంలోని రోడ్ల వెంట నడక సాగించిన ఎమ్మెల్యే ఆ ప్రాంతంలో సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. కరెంటు స్తంభాలు, వీధిలైట్ల ఏర్పాటు, మురికి కాలువల నిర్మాణం లాంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి కాలనీని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు.

- Advertisement -

వనపర్తి లో రాజకీయాలకి అతీతంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, పట్టణాభివృద్ధిలో రాజకీయాలు ఒక చిన్న భాగమే తప్ప అభివృద్ధికి ఆటంకాలు కాకూడదన్న సంకల్పంతో ముందుకెళుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో కాలనీవాసులు స్థానిక పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News