- సబితా ఇంద్రారెడ్డి
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఓటర్లను కోరారు. మోయినాబాద్ మున్సిపాలిటీలో అజీజ్‌నగర్ 5, 6, 7, 8 వార్డుల్లో రోడ్‌షో, గడపగడప ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేయలేదని, 420 హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని విమర్శించారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొంటూ, ప్రజలు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు భారీగా ఓటు వేసి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ వార్డు అభ్యర్డులు కొత్త మాణిక్ రెడ్డి, మాడి మల్లారెడ్డి, మంచే శంకరయ్య యాదవ్, ముంజగాళ్ళ మాణిక్యం, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
