మల్కాజ్గిరి బాలుర ఉన్నత పాఠశాలలో మేడ్చల్ జిల్లా స్థాయి స్పెల్ బీ పోటీలను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ పోటీల్లో జవహర్ నగర్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి త్రిశాంక్ ప్రతిభ చాటి ప్రథమ బహుమతి సాధించారు. విజేతగా నిలిచిన త్రిశాంక్‌కు మల్కాజ్గిరి ఎంఈఓ మనోహర్ చేతుల మీదుగా బహుమతిని అందజేశారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించడంలో స్పెల్ బీ పోటీలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పోటీల్లో మరింత మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆజాం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని విజేతను అభినందించారు.
