బీసీల ఆరాధ్య దైవం మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని జవహర్ నగర్ లో ఏర్పాటు చేయాలని జవహర్ నగర్ బీసీ ఐక్య వేదిక కమిటీ గురువారం శైలేష్ యాదవ్ ను కలిసి విగ్రహాన్ని అందించాలని కోరింది. కమిటీ విజ్ఞప్తికి తక్షణమే స్పందించిన శైలేష్ యాదవ్ పూలే విగ్రహ ఏర్పాటుకు అయ్యే పూర్తి ఖర్చును బీసీ ఐక్య వేదిక కమిటీకి అందజేశారు.
ఈ సందర్భంగా బీసీల హక్కుల పరిరక్షణకు మహాత్మ జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని కమిటీ సభ్యులు తెలిపారు. పూలే విగ్రహ స్థాపనతో సామాజిక చైతన్యం మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో బీసీ ఐక్య వేదిక గౌరవ సలహాదారులు కారింగుల శంకర్ గౌడ్, జవహర్ నగర్ బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు మారోజు సోమాచారి, ఉపాధ్యక్షులు గొడుగు వేణు, ప్రధాన కార్యదర్శి శనిగరం నరసింహ రజక, కోశాధికారి రేగోటి సురేష్ నేత, కార్యదర్శులు పాక దేవేందర్, వల్లెపు మల్లేష్, కాసోజు రమేష్ చారి, రామ్ బ్రహ్మచారి, గాలయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
