Friday, February 27, 2026
Homeహైదరాబాద్‌OU | ఓయూ లో విద్యార్థి సంఘాల ఎన్నికల పునరుద్ధరణకు డిమాండ్

OU | ఓయూ లో విద్యార్థి సంఘాల ఎన్నికల పునరుద్ధరణకు డిమాండ్

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల ఎన్నికలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ (UCASS)లో సెమినార్ నిర్వహించారు.ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు సృజన్, సంజయ్, శ్రీధర్, రత్నశేఖర్, అరుణ్, అజయ్ సారధ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా EFLU స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలు పోరిక వికాస్ మాట్లాడుతూ,ఎన్నికైన విద్యార్థి సంఘాలే ప్రజాస్వామ్యానికి పునాది అని అన్నారు.

నామినేటెడ్ బాడీలు విద్యార్థుల సమస్యలను సమర్థంగా ప్రతినిధ్యం వహించలేవని పేర్కొన్నారు.సుప్రీంకోర్టు మార్గదర్శకాలు,లింగ్డో కమిటీ సిఫార్సులతో సురక్షితంగా ఎన్నికలు నిర్వహించవచ్చని తెలిపారు.హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఉమేష్ అంబేద్కర్,జాయింట్ సెక్రటరీ త్రివేణి మాట్లాడుతూ స్కాలర్‌షిప్ ఆలస్యాలు,ఫీజుల పెరుగుదల,విధాన నిర్ణయాల్లో విద్యార్థుల భాగస్వామ్యం లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని సెమినార్‌లో ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News