Friday, February 27, 2026
Homeహైదరాబాద్‌Corporator | సీతాఫలమండి అభివృద్ధి పనులపై ఆకస్మిక తనిఖీ

Corporator | సీతాఫలమండి అభివృద్ధి పనులపై ఆకస్మిక తనిఖీ

సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధి సీతాఫలమండి డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.వీరయ్య గల్లిలో రూ.48 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ పనులు,మధురనగర్‌లో రూ.47.50 లక్షలతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ రెండో అంతస్తు పనులను పరిశీలించి,నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.

ఎస్.ఆర్.హాస్పిటల్ వెనుక డ్రైనేజీ ఓవర్‌ఫ్లో సమస్యపై వెంటనే స్పందించి,శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జి.హెచ్.ఎం.సి ఏ ఈ వేణు,జలమండలి మేనేజర్ నవ్య,బి. అర్.ఎస్ నాయకులు శైలెందర్,బాలాజీ,స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News