- సికింద్రాబాద్ అభివృద్ధిలో మరో కీలక అడుగు
- సీతాఫలమండీ ప్రభుత్వ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి
- రూ.12 కోట్లతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం తనిఖీ
సీతాఫలమండీలో నిర్మాణంలో ఉన్న కుట్టి వెల్లోడీ ప్రభుత్వ ఆసుపత్రిని సికింద్రాబాద్ పరిధిలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు,మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ ఆదేశించారు.రూ.12 కోట్ల వ్యయంతో వంద పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఆసుపత్రి భవన నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అలాగే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆధునిక వసతులతో,ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా ఆసుపత్రిని తీర్చిదిద్దాలని సూచించారు.ఈ ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభం ద్వారా సీతాఫలమండీతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సామాల హేమ,కంది శైలజ,సమన్వయకర్త రాజా సుందర్,సంబంధిత అధికారులు,పార్టీ నాయకులు పాల్గొన్నారు.
