- అభివృద్ధితో పాటు చిల్కూర్ మున్సిపాలిటీగా పేరు మార్పు హామీ
- చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
మొయినాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. చిలుకూరు ఇంద్రారెడ్డి కాలనీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
బీజేపీ గెలిస్తే కమ్యూనిటీ హాలు, వాటర్ ట్యాంక్, సివరేజ్ సమస్యల పరిష్కారం వంటి మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే బీజేపీ మున్సిపల్ ఛైర్మన్ పదవి దక్కితే మొయినాబాద్ మున్సిపాలిటీ పేరును చిల్కూర్ మున్సిపాలిటీగా మారుస్తామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, రవికుమార్ యాదవ్, సీనియర్ నాయకులు అంజన్ కుమార్ గౌడ్, కంజర్ల ప్రకాష్, ఛాన్వేలి ప్రభాకర్ రెడ్డి, గున్నల గోపాల్ రెడ్డి, మోర నరసింహారెడ్డి, మంచిరేవుల శ్రీరాములు, దర్గా నరేందర్, సహదేవ్ గౌడ్, మండల అధ్యక్షుడు దారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్ అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్యక్రమంలో 22వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి గున్నాల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. చిలుకూరులో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.
