మోత్కూర్ మున్సిపాలిటీ లోని 12 వార్డుల నుండి కౌన్సిలర్ గా పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీ ఫాం లను కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాదని మోత్కూర్ పట్టణంలోని బార్ అండ్ రెస్టారెంట్ రూమ్ లో సోమవారం తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ అందజేయడం బాధాకరం అని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎండి ఆయాజ్ అన్నారు. ఆయన పత్రిక ప్రకటనతో తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాదని బార్ రెస్టారెంట్ లో ఇవ్వడం కాంగ్రెస్ పార్టీని,పార్టీ కార్యకర్తలను అవమానించినట్టుగా భావిస్తున్నామన్నారు.బార్ అండ్ రెస్టారెంట్ రూం ల్లో ఇవ్వడం ఇది కాంగ్రెస్ సంస్కృతికి విరుద్ధం అన్నారు.
దీని వెనక రాజకీయ కుట్రలు,స్వార్థ రాజకీయాలు,కాంగ్రెస్ పార్టీ జెండాని మోసిన కార్యకర్తలకు ఘోర అవమానం కలిగించిందన్నారు.పార్టీలో కష్టపడ్డ కార్యకర్తల సమక్షంలో కాకుండా బార్ అండ్ రెస్టారెంట్ లో ఇవ్వడం దీని వెనుక డబ్బు రాజకీయాలు మారి టికెట్లను అమ్ముకున్నారని ప్రజలు భావిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ యాదాద్రి జిల్లా మున్సిపల్ ఎలక్షన్స్ ఇన్చార్జ్ మంత్రి సీతక్క,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీర్ల ఐలయ్య,భువనగిరి పార్లమెంట్ మెంబర్ చామల కిరణ్ కుమార్ రెడ్డి లకు ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు అని దీనికి సంబంధించిన నాయకులపై చర్యలు తీసుకోగలరని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతున్నామన్నారు.
