- మేడారం జాతర భక్తుల తో రద్దీగా మారిన ఆలయం
ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మి నర్సింహాస్వామి దివ్య క్షేత్రం మహిమాన్వితం. స్వయంభువుడుగా జ్వాలా నరసింహుడిగా వెలసిన శ్రీ లక్ష్మినర్సింహాస్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుని వెళుతుoటారు. కోరిన కోర్కలు తీర్చే శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామికి తాము మొక్కిన మొక్కులు ప్రస్తుతం సమర్పించుకుంటున్నారు.
ఇందులో బాగంగానే మేడారం జాతరకు వచ్చిన వేలాది మంది భక్తులు, యాత్రికులు ప్రతీరోజూ మల్లూరు క్షేత్రానికి భక్తులు పోటెత్తి స్వామి వారిని దర్శించుకుoటు న్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చిన భక్తులు స్వయంభువుడగా ఉన్న లక్ష్మి నర్సింహాస్వామిని దర్శించుకుoటున్నారు. ముందుగా చింతామణి తోగుకు చేరుకుని గుట్టపైనుండా భూగర్భం గుండా ఉబికి వస్తున్న నీటిని పరిశీలించి పవిత్ర స్నానాలు చేసి మెట్ల మార్గం గుండా స్వామి వారి సన్నిదికి చేరకున్నారు. అనంతం స్వామి వారికి దూప దీప నైవేద్యాలను సమర్పించుకుని, గోత్రనామాలతో అర్చనలు చేయించుకున్నారు.

అనంతరం స్వామి వారి నాభీ చంద నాన్ని స్వామి వారి కుంకుమను తీసుకుని తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారు వెలసిన విధానం, లక్ష్మి నర్సింహాస్వామి గుట్టలో కొలువూ ఉండగా తనని అప్పటి పాలకుడు అయిన దీప కర్ణ మహారాజుకు కలలో కనపడి నేను హేమాచల గుట్టల్లో కొలువై ఉన్నానుప అన చెప్పగానే దీపకర్ణ మహారాజు తన వేలాది సైన్యంతో గుట్టను తవ్వుతుండగా గునపం ( గడ్డ పలుగు) స్వామి వారి నాభిలో దిగడంతో మనిషి రూపంలోఉన్న స్వామి వారికి రక్తం కారుతుండగా అప్పటి రాజు స్వామివారికి గంధము, చoదనాన్ని అడ్డుగా పెట్టాడని అందుకే స్వామి వారి నాభినుంచి ఇప్పటికి ఆ నాభి ద్రవం కారుతుందని అర్చకులు భక్తులకు వివరించారు.
అలాంటి “నాబి చందనా”న్ని తీసుకునేందుకు భక్తులు ప్రతీ శని,ఆదివారం బారు లు తీరతారు. ప్రతీ శని, ఆదివారాల్లో స్వామి వారిక అభిషేకాన్ని నిర్వ హిస్తున్న కారణంగా శని ఆదివారాల్లో భక్తులు పోటెత్తుతుంటారు. స్వామి వారి దర్శనం అనంతరం గుట్ట క్రింది బాగంలోని దైత అమ్మ వారి వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి కోళ్ళు మేకలను బలిచ్చి సహపంక్తి భోజనాలను చేసి సాయంత్రం వరకు ఆనందంగా గడిపి తిరగు ప్రయాణం అవుతున్నారు. కార్యక్రమంలో ఆలయ ప్ర ధాన అర్చకుడు ముక్కామల రాజశేఖర్ శర్మ, పవన కుమారాచార్యు లు, ఈశ్వర్ చంద్, సిబ్బంది సీతారాములు, శేషు, లక్ష్మి నారాయణ. అజయ్ తదితరులు పాల్గొన్నారు.
