Wednesday, February 11, 2026
Homeవరంగల్‌Peddi Sudarshan Reddy | కేసీఆర్ ను వేధించడం నీచమైన పని

Peddi Sudarshan Reddy | కేసీఆర్ ను వేధించడం నీచమైన పని

  • విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్‌ ని సిట్ విచారణ పేరుతో ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ఆందోళనలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేసిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి.

ఈ సందర్భంగా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ రిసార్ట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
రాష్ట్ర సాధకుడు తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ కి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కుట్టపూరితంగా నోటీసు పంపించి విచారణ పేరుమీద అవమానాలకు గురి చేస్తుందన్నారు.

- Advertisement -

కుంభకోణాల్లో మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాటి నుంచి తప్పించుకునేందుకు రోజురోజుకు కొత్త కొత్త నాటకాలకు తెరలేపుతోంది. కాంగ్రెస్ పార్టీ కుట్రపూర్వతంగా కెసిఆర్ నోటీసు పంపించి తెలంగాణ ప్రజలకు రోజుకో సినిమా చూపిస్తున్నారని, ఒక్క హామీ నెరవేర్చలేని వాళ్ళు మున్సిపల్ ఎన్నికల్లో భూస్థాపితం చేస్తాం అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ చేసిన కుంభకోణాలను కోర్టు స్వయంగా విచారణకు ఆదేశించినప్పటికీ, ఆ విచారణను ఎదుర్కొనే ధైర్యం లేక కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనక్కి తగ్గడం ప్రజలకు అన్నీ అర్థమవుతున్న విషయమే. నిజాలు బయటకు వస్తాయన్న భయంతోనే విచారణకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ స్పష్టంగా భావిస్తోందన్నారు.ప్రజలను మభ్యపెట్టే దొంగ నాటకాలకు, అబద్ధపు ప్రచారాలకు ఇక అవకాశం లేదని బిఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తోందన్నారు.

నర్సంపేట నియోజకవర్గంలో ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగకుండా చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలతో స్థానిక నాయకులు కుట్రలకు పాల్పడుతున్నారని మా పార్టీ దృష్టికి వచ్చింది, అర్ధరాత్రి వేళల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, కార్యకర్తలను బెదిరించడం వంటి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ తరహా భయభ్రాంతుల రాజకీయాలకు బిఆర్ఎస్ పార్టీ భయపడేది లేదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చివరి వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు. నర్సంపేటలో ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు, అక్రమ చర్యలు లేకుండా నిర్మలమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలన్నదే మా లక్ష్యం, ఏకపక్ష పాలనకు, దోపిడీ రాజకీయాలకు ఇక ముగింపు పలకాలన్నదే నర్సంపేట ప్రజల ఆకాంక్ష. ఆ ఆకాంక్షను నెరవేర్చగల శక్తి బిఆర్ఎస్ పార్టీకే ఉందని మేము నమ్ముతున్నామన్నారు.

బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే నర్సంపేట ప్రజలకు స్థిరమైన పాలన, అభివృద్ధి, సంక్షేమం తప్పకుండా అందుతుందని మరోసారి స్పష్టంగా చెబుతున్నాము. రేపు నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన అన్ని స్థానాల అభ్యర్థుల వివరాలను ప్రకటించి, ప్రజల ముందుకు వెళ్లనున్నామని తెలియజేస్తున్నాము. ప్రజలే మా బలం, ప్రజలే మా ఆశ్రయం అన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నాము.కాంగ్రెస్ పార్టీని జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి కేసీఆర్ గౌరవాన్ని నిలబెట్టాలని తెలంగాణ ప్రజలను నర్సంపేట ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్, నియోజకవర్గా కోఆర్డినేటర్,జిల్లా నాయకులు,మాజీ ఎంపీపీ,మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్,ఎన్నికల కన్వీనర్,నియోజకవర్గ యూత్ కన్వీనర్, బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు,రూరల్ మండల కార్యదర్శి,క్లస్టర్ బాధ్యులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News