అంతర్యుద్ధం, విస్తృత అణచివేతల నేపథ్యంలో జరిగిన మయన్మార్ ఎన్నికల్లో(Myanmar General Elections) సైనిక మద్దతు గల పార్టీ(military-backed party) విజయం సాధించింది. మూడు దశల్లో నిర్వహించిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో యూనియన్ అండ్ సాలిడారిటీ పార్టీ(Union and Solidarity Party)(యూఎస్‌డీపీ-USDP) ఆధిక్యత ప్రదర్శించింది. రెండు చట్ట సభల్లో అద్భుతమైన మెజారిటీని సొంతం చేసుకుంది. ఈ ఎలక్షన్ రిజల్ట్ నిన్న గురువారం, ఇవాళ శుక్రవారం విడుదలయ్యాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. అమియోతా హ్లుట్టావ్ ఎగువ సభలో 157 సీట్లలో 109 స్థానాలను, పైతు హ్లుట్టావ్ దిగువ సభలో 263 సీట్లకు 232 స్థానాలను యూఎస్‌డీపీ గెలుచుకుంది. మయన్మార్ పార్లమెంట్ మార్చిలో సమావేశమై అధ్యక్షుణ్ని ఎన్నుకునే అవకాశం ఉందని, ఏప్రిల్‌లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని సైనిక అనుకూల ఎలెవెన్ మీడియా గ్రూప్ ఈ నెల ప్రారంభంలో జుంటా ప్రతినిధి జా మిన్ తున్‌ను ఉటంకిస్తూ నివేదించింది.
Myanmar | మయన్మార్ ఎన్నికల్లో USDP అఖండ విజయం
- Advertisement -
RELATED ARTICLES
