Homeహైదరాబాద్‌Congress | సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ కాగడాల ర్యాలీ

Congress | సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ కాగడాల ర్యాలీ

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు నిరసనగా కదం తొక్కిన పార్టీ శ్రేణులు

సికింద్రాబాద్, జనబరి 30(ఆదాబ్ హైదరాబాద్): సికింద్రాబాద్ నియోజకవర్గ(Secunderabad Constituency) కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్(Congress Party Incharge) ఆదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నామాలగుండు నుంచి సీతాఫల్‌మండి మీదుగా చిలకలగూడ గాంధీ విగ్రహం వరకు కాగడాల ర్యాలీ(Rally) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ సచిన్ ముఖ్య అతిథిగా పాల్గొనగా డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర పథకాలకు గాంధీ పేరు(Gandhi Name)ను తొలగించడం దేశ చరిత్రకు అవమానమని అన్నారు.

- Advertisement -
secunderabad congress party2

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(National Rural Employment Guarantee Scheme) నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం దేశ చరిత్ర, విలువలను అవమానించడమేనని సచిన్ తీవ్రంగా విమర్శించారు. ‘గాంధీజీ పేరు తీసేస్తే పేదల జీవితాలు మారతాయా? ఇది పేరు కాదు. పేదల హక్కు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది’ అని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్ జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ఆదం సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ ఆశయాలే కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకమని చెప్పారు. పేదల హక్కులను కాలరాస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని, రోడ్లపైకి వచ్చి పోరాడుతుందని పేర్కొన్నారు. ర్యాలీలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News