- భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బాలాపూర్ లో జాగో భాగ్యనగర్ ధర్మ రక్షణ సభ..
- ధర్మాన్ని కాపాడేందుకు వేసిన అడుగు..
- ఇది ఒక సభ కాదు? ఒక ఉద్యమం..
- భాగ్యనగరం నుంచి దేశవ్యాప్తంగా సాగే ఉద్యమం..
- ధర్మం కాపాడబడుతుంది..
- మన సంస్కృతి నిలబడుతుంది.
- వెంటనే రోహ్యింగ్యాలను, బంగ్లా దేశస్తులను అరెస్ట్ చేసి ఇక్కడినుండి తరిమెయ్యాలి..
- పిలుపునిచ్చిన సుధాకర్ పులిమద్ది శివయోగి..
- బాలాపూర్ లో విజయవంతమైన ధర్మ రక్ష సభ..
బాలాపూర్ సాక్షిగా జరిగిన ధర్మ రక్ష సభ ఊహించినదానికంటే విజయవంతం అయ్యింది.. హిందూ సోదరులు ఈ సభలో కదం తొక్కారు రోహ్యింగ్యాలను, బంగ్లాదేశం నుంచి వచ్చిన అక్రమ చొరబాటు దారులను తరిమి కొట్టాలని ముక్త కంఠంతో నినదించారు.. ఈ సభలో పలువురు హిందూ ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు..
ఈ సందర్భంగా సుధాకర్ పులిమద్ది శివయోగి మాతాడుతూ.. అక్రమ చొరబాటుదారులు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారని ఒప్పుకున్నది పోలీస్ డిపార్ట్మెంట్.. మనం సభ పెట్టుకోవద్దని చెప్పింది.. వాళ్ళను పంపిస్తామని కోర్టు కూడా చెప్పింది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ ధర్మ రక్ష సభ.. వారిని తరిమేసే కార్యక్రమం చేపట్టాలని వినగపతి చేస్తూ కంప్లైంట్ చేసింది..
ఈ రోజు మన సభ విజయవంతం అయ్యింది.. జనవరి 24 వందేమాతరం, జనగణమన జాతీయ గీతాలుగా ఆమోదించబడింది రోజు.. భారత రాజ్యాంగం 200 పైచిలుకు ఆమోదించి సంతకాలు పెట్టిన రోజు.. అదేవిధంగా రోహ్యింగ్యాలను, బంగ్లా దేశస్తులను తరిమికొట్టే రోజు కూడా కావాలి.. పోలీసులారా, ప్రభుత్వ పెద్దలారా వారిని అదుపులోకి తీసుకుని ఈ దేశం నుంచి తరిమేయ్యండి అని సుధాకర్ పులిమద్ది శివయోగి పిలుపునిచ్చారు..
ఈ సందర్భంగా ఆయన హిందువుల గురించి మాట్లాడుతూ.. రాముడి వెనకాల ధర్మం కోసం అడుగువేసేవాడు హిందువు అని ఆయన గుర్తు చేశారు.. కృష్ణుడి వెనకాల ధర్మం కోసం అడుగేసినటువంటి వాడు హిందువు.. గ్రీకులను, షాకునులను, హూణులను, కుషాణులను తన్ని తరిమేసి వాడు హిందువు.. ఆదిశంకురుల ఆదర్శం, రామానుజుల సామాజిక సామరశ్యత చాటిన వాడు హిందువు.. తురుష్కులు, మొగాలులు, గజనీలను, గోరీలను, తుగ్లక్ లను, నిజాములను, రజాకారులను, పఠానులను ఎదిరించినవాడు హిందువు.. ఇది హిందూ పరిచయం..
మన పూర్వికులు ఎంతో గొప్పవాళ్ళు ఆ రక్తం పంచుకుని పుట్టినవాళ్ళం మనం.. ఇది కేవలం సభ మాత్రమే కాదు రాబోయే మహోద్యమానికి నాంది కావాలి.. ఈ మహాసభను నడపడం వలన గొడవలు జరుగుతాయోమో అని పోలీసులు, కోర్టు అంటే.. ఒక్కటే చెబుతున్నాం.. 47 సంవత్సరాలుగా బాలాపూర్ నుంచి గణనాధుడు కదులుతున్నాడు.. ఇక విజ్ఞాలు అనేవి ఉండవు అని ఆయన అన్నారు.. ఈ వేదిక రాజకీయ వేదిక కాదు.. బాలాపూర్ పుర ప్రముఖులందరూ ఒకే మాట అంటున్నారు మాకు రాజకీయాలకంటే ధర్మమే ముఖ్యమని.. ఇది చాలా గర్వించదగ్గ విషయం..
ఈ స్ఫూర్తి బాలాపూర్ నుంచే ప్రారంభం కావాలి.. రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా ఒక ప్రభంజనంలా మారబోతోంది.. భాగ్యనగరంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులు, అలాగే రోహ్యింగ్యాలను అరెస్ట్ చేసి, వారిని ఇక్కడనుంచి తరిమేసేందుకు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైనటువంటి ఐబీ, ఎం.ఐ.ఏ. పోలీస్ విభాగం, స్పెషల్ బ్రాంచ్, ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రత్యేక జాయింట్ యాక్షన్ కమిటీ నియమించాలి..
ప్రపంచ దేశాల్లో అమలవుతున్నటువంటి పటిష్టమైన ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ను అమలు చేయాలని, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అక్రమ చొరబాటుదారులను గుర్తించే వేగవంతమైన ప్రక్రియ అమలుచేయాలని, భారతీయ చట్టాల ప్రకారం ఇక్కడ అక్రమంగా నివసిస్తున్నటువంటి అక్రమ చొరబాటుదారులకు గుర్తింపునిచ్చే నకిలీ పత్రాలను ఇస్తున్న నెట్ వర్క్ పైన కూడా దేశ విద్రోహం క్రింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ధర్మ రక్షణ సమితి తరఫున ఆయన డిమాండ్ చేశారు..
దేశ రక్షణ సంస్థలైన డీ.ఆర్.డీ.ఏ. లాంటి సంస్థల చుటూ ఈ చొరబాటు దారులు మకాం వేసి ఉన్నారు.. వీరి వలన బాలాపూర్ పరిసర ప్రాంత వాసులు ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఎన్నో రూపాలు సంతరించుకున్న జిహాద్ ఇక్కడి ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని హింసిస్తోంది.. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలమీద ఉందని ఆయన తెలిపారు..
