హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్(Hyderabad City Police Commissioner) సజ్జనార్(Sajjanar) నోటీసులకు సమాధానం ఇస్తానని బీఆర్ఎస్ నేత(BRS Party Leader), ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని ఇస్తానని తెలిపారు. అనంతరం ఎలాంటి చర్యలు తీసుకోవాలో పోలీసుల ఇష్టమని అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. దౌర్జన్యాలపై పోరాటం కొనసాగిస్తానని తేల్చిచెప్పారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటానని, నోటీసులకు, వార్నింగ్‌లకు భయపడనని తెలిపారు. సిట్ చీఫ్ సజ్జనార్‌పై ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కేసులపై మరో సిట్ వేయాలని తాను అన్నట్లు నోటీసులో ఉందని, అది నిజం కాదని స్పష్టం చేశారు. నాటి డీజీపీ, హోం సెక్రెటరీ, సీఎస్‌లను వదిలేసి రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్ రావును, ఆయన ఫ్యామిలీని, ప్రభాకర్ రావుతో కలిసి పనిచేసినవారిని, చుట్టాలను వేధించడం సరికాదని హితవు పలికారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ పాలిటిక్స్‌లో భాగం కావొద్దని సూచించారు.
RS Praveen Kumar | సజ్జనార్‌కు సమాధానమిస్తా
- Advertisement -
RELATED ARTICLES
