Tuesday, March 3, 2026
Homeరంగారెడ్డిVote Awareness | ఓటు వజ్రాయుధం లాంటిది

Vote Awareness | ఓటు వజ్రాయుధం లాంటిది

  • ఇది రాజ్యాంగం మనకి కల్పించిన హక్కు.
  • సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, న్యాయవాది కిక్కర గోపీ శంకర్ యాదవ్.

ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా మీ ఓటుహక్కు ను వినియోగించుకోండి. ప్రజాస్వామ్మ్యాన్ని కాపాడ వలసిన బాధ్యత నేటి యువతరం చేతిలోనే ఉంది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, న్యాయవాది కిక్కర గోపీ శంకర్ యాదవ్.

16 వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా హయత్ నగర్ ప్రభుత్వడిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ న్యాయ వాది కిక్కర గోపీ శంకర్ యాదవ్ హాజరై, విద్యార్థులకు ఓటు హక్కు యొక్క విశిష్టత ను తెలియ జేశారు. ఓటు మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు అని దానిని డబ్బు కి బీరు, బిర్యానీ లకు అమ్ముకోవద్దు అని సూచించారు. ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా నిజమైన నాయకుడ్ని ఎన్నుకొన్నప్పుడే, రాజ్యం సుభిక్షంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో హయత్ నగర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ శ్రీ వి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా,అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ బి నరసింహ, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ డి శ్రీపతి నాయుడు, రాజనీతి శాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్ వి నాగరాజ్ యాదవ్, డాక్టర్ ఈ యాదగిరి రెడ్డి, ప్రొఫెసర్ నాగేంద్ర, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శారదా దేవి, ఎన్సిసి ఏఎన్ఓ డాక్టర్ ధనరాజ్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ అనిత, లైబ్రేరియన్ డాక్టర్ ఆనంద్ దుర్గ ప్రసాద్, డాక్టర్ గీత నాయక్, డాక్టర్ పులి రమాదేవి, డాక్టర్ హవేజ్ డాక్టర్ శ్రీపాద గంగాధర్,

- Advertisement -
RELATED ARTICLES

Latest News