Homeస్పోర్ట్స్ICC | మీ ప్లేస్‌లో స్కాట్లాండ్‌ను తీసుకున్నాం

ICC | మీ ప్లేస్‌లో స్కాట్లాండ్‌ను తీసుకున్నాం

బంగ్లాదేశ్‌కి అధికారికంగా చెప్పిన ఐసీసీ

ఇండియాలో టీ20 వరల్డ్ కప్(T20 World Cup) మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్(Bangladesh) నిరాకరించిన నేపథ్యంలో ఐసీసీ స్పందించింది. బంగ్లాదేశ్‌కు బదులుగా స్కాట్లాండ్‌(Scotland)కి అవకాశం ఇచ్చింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్‌కి అధికారికంగా వెల్లడించింది. దీనిపై శుక్రవారం సాయంత్రం ఐసీసీ సీనియర్ అధికారులు (చైర్మన్ జైషా సహా) దుబాయ్ నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి ఇ-మెయిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇండియాలో ఆడతారా లేదా అనే విషయంలో మీ నిర్ణయం చెప్పాలంటూ ఐసీసీ చైర్మన్ ఇచ్చిన గడువు లోపు మీ నుంచి సమాధానం రాకపోవటంతో స్కాట్లాండ్‌ను తీసుకున్నాం అని సంబంధిత వర్గాలు పీటీఐకి తెలిపాయి. ఆడేదీ లేనిదీ ఐసీసీకి అధికారికంగా చెప్పక ముందే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ఢాకాలో ప్రెస్ మీట్ పెట్టి నిర్ణయాన్ని ప్రకటించడం ప్రొటోకాల్‌(Protocol Violation) ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తమను ఉద్దేశపూర్వకంగానే పక్కనపెడుతున్నట్లు కూడా బంగ్లాదేశ్ ఆరోపించిందని చెప్పారు. అయితే.. టీ20 వరల్డ్ కప్‌లో తమకు ఆడే అవకాశం కల్పించిన విషయమై ఐసీసీ నుంచి అధికారిక సమాచారం అందలేదని స్కాట్లాండ్ వెల్లడించింది. సరైన సమయంలో చెబుతారని ఆశిస్తున్నట్లు అభిప్రాయపడింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News