టీ హబ్‌ను డిస్టబ్ చేయొద్దని, స్టార్టప్ కేంద్రం(Startup Center)గానే కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టీ హబ్‌కు మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన వెంటనే స్పందించారు. అమెరికా పర్యటన(America Tour)లో ఉన్న సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఫోన్ చేసి మాట్లాడారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు. టీ హబ్‌ను ప్రత్యేక స్టార్టప్‌ల కేంద్రంగానే గుర్తించాలని చెప్పారు. ఇంక్యుబేటర్(Incubator)గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్ (Innovation Catalyst)గా స్టార్టప్‌లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ హబ్‌లో ఇతర ఆఫీసులు ఉండకూడదని, అలాంటి ఆలోచనలుంటే విరమించుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు.
T-Hub | టీ హబ్‌ను డిస్టబ్ చేయొద్దు: సీఎం రేవంత్
- Advertisement -
RELATED ARTICLES
