Monday, March 2, 2026
Homeవరంగల్‌Vote | ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవాలి

Vote | ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవాలి

వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి ప్రతినిధి, జనవరి 23(ఆదాబ్ హైదరాబాద్): ప్రతి ఓటరు(Voters) ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్(Wanaparthy District Collector) ఆదర్శ్ సురభి చెప్పారు. ఓటు హక్కును వినియోగించుకోవటం ద్వారా ప్రజాస్వామ్య విలువల(Democratic Values)ను కాపాడాలని సూచించారు. జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవాల(National Voters Day Celebrations) సందర్భంగా శుక్రవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, ఐడీఓసీ సిబ్బందితో ఓటర్ దినోత్సవంపై ప్రతిజ్ఞ(Pledge) చేయించారు. ‘దేశ పౌరులుగా మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతాం. కులం, మతం, జాతి, వర్గం, భాషాపరమైన ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తాం’ అని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్) యాదయ్య, మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, ఐడీఓసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News