Wednesday, February 11, 2026
Homeఆరోగ్యంUrine | మూత్రం.. ఆపొద్దు ఏమాత్రం..

Urine | మూత్రం.. ఆపొద్దు ఏమాత్రం..

తప్పనిసరి పరిస్థితుల్లో అయితే తప్ప మూత విసర్జన ఆపొద్దు. యూరిన్‌ని ఎక్కువసేపు ఆపితే చెడు ఫలితాలు వస్తాయి. కాబట్టి మూత్రాన్ని ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. వెంటనే విసర్జించటం మంచిది. ఎన్ని ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తే ఆరోగ్యానికి అంత మంచిదని(Good For Health) వైద్యులు చెబుతున్నారు. మామూలుగా అయితే మనం నిత్యం 6 నుంచి 8 సార్లు యూరిన్ పాస్ చేయాలి. మన ఒంటిలోని ద్రవాలను, చెడు పదార్థాలను కిడ్నీలు మూత్రం రూపంలో బయటికి పంపిస్తాయి. కాబట్టి.. కారణాలు ఏవైనా.. ఆ వ్యర్థాలను మనం ఒంటిలో ఉంచుకోకపోవటమే ఉత్తమం. లేకపోతే ఇన్ఫెక్షన్ల(Infections) బారిన పడాల్సి వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మూత్రాశయ కండరాలు వీక్(Muscle Weak) అవుతాయి. దీనివల్ల మూత్రాశయం పనిచేయలేని స్థితిలోకి వెళ్లిపోయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. అందువల్ల యూరిన్ పాస్ చేసే విషయంలో మనం మన బాడీ చెప్పినట్లు వినాలి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News