క్రీడా రంగంలో భాగస్వామ్యంపై విస్తృత చర్చ
ప్రపంచ ఆర్థిక వేదిక(WEF) సదస్సు-2026 సందర్భంగా దావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Telangana CM Revanth Reddy) స్విట్జర్లాండ్(Switzerland) లోని వాడ్(Vaud) రాష్ట్ర సీఎం క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్‌తో సమావేశమయ్యారు. ఇండియా(India)–స్విట్జర్లాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(Free Trade Agreement) నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య సహకారం పెంపుపై చర్చించారు.
❇️ ఈ సందర్భంగా సీఎం రేవంత్.. తెలంగాణ రైజింగ్–2047 విజన్‌ను స్విస్ ప్రతినిధులకు వివరించారు. హైదరాబాద్‌లో ప్రపంచంలోనే తొలిసారి ‘స్విస్ మాల్’ ఏర్పాటుచేయాలనే ఆలోచనను సీఎం ప్రతిపాదించగా స్విస్ బృందం సానుకూలంగా స్పందించింది.
❇️ ఇద్దరు సీఎంలు ఫుట్‌బాల్ క్రీడాకారులే కావడంతో క్రీడా రంగంలో భాగస్వామ్యం(Participation in the field of sports)పై కూడా విస్తృతంగా చర్చించారు. క్రీడా శిక్షణ, మౌలిక వసతుల అభివృద్ధిలో కలిసి పనిచేయొచ్చని అభిప్రాయపడ్డారు.
❇️ సంస్కృతి, విద్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ రంగాల్లో, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, క్రీడల విభాగాల్లో పరస్పర సహకారానికి అవకాశాలపై ఇద్దరు సీఎంలు అభిప్రాయాలు పంచుకున్నారు. రిటైల్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అవకాశాలపై చర్చించారు. మహిళా సాధికారతకు సంబంధించి స్వయం సహాయక సంఘాల కార్యక్రమాలపై స్విస్ బృందం ఆసక్తి కనబరిచింది.
❇️ పరస్పర సహకార అంశాలు పరిశీలించేందుకు త్వరలోనే స్విట్జర్లాండ్ బృందం హైదరాబాద్‌లో పర్యటిస్తుందని వాడ్ రాష్ట్ర పరిశ్రమలు, ఆర్థిక శాఖ మంత్రి ఇసబెల్ మోరెట్ తెలిపారు.
